Begin typing your search above and press return to search.

ఐశ్వ‌ర్యారాయ్ మ‌రో శివ‌గామి రేంజులో..!

By:  Tupaki Desk   |   25 Aug 2021 10:42 AM GMT
ఐశ్వ‌ర్యారాయ్ మ‌రో శివ‌గామి రేంజులో..!
X
దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు మ‌ణిర‌త్నంతో ఐశ్వ‌ర్యారాయ్ అనుబంధం గురించి తెలిసిందే. ఐష్ కి ఆయ‌నే మెంటార్. త‌న‌కు గురువుగా మారి న‌టిగా తీర్చిదిద్దారు. అందుకే ఇంత గ్యాప్ త‌ర్వాత కూడా పొన్నియ‌న్ సెల్వ‌న్ లో ఆఫ‌ర్ ఇవ్వ‌గానే ఐష్ కాద‌నుకుండా న‌టిస్తోంది. పొన్నియిన్ సెల్వన్ మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది రెండు భాగాలుగా విడుదల కానుంది. మొదటి భాగం 2022 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పీరియడ్-డ్రామాలో విక్రమ్- జయం రవి- ప్ర‌కాష్ రాజ్- కార్తీ- త్రిష- ఐశ్వర్యలక్ష్మి -శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్నార‌ని స‌మాచారం. త‌న రెండు పాత్ర‌ల‌ను మ‌ణి స‌ర్ అంత గ్రిప్పింగ్ గా తీర్చిదిద్దార‌ని క‌థ‌నాలొచ్చాయి. ఇటీవ‌ల ఐష్ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్నారు.

తాజాగా పొన్నియిన్ సెల్వన్ ఆన్ లొకేష‌న్ నుంచి ఓ ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. లీక్ అయిన ఫోటోలో ఐష్ ఎరుపు రంగు చీర‌లో క‌నిపిస్తున్నారు. ఆ చీర‌కు త‌గ్గ‌ట్టుగానే భారీ ఆభరణాలతో అలంక‌రించుకుంది. ఆమె చుట్టూ చిత్ర‌బృందం హ‌డావుడిగా ఉన్నారు. ఇక ఈ మూవీలో ఐశ్వర్యరాయ్ రెండు పాత్రలు పోషిస్తున్నారు. నందిని మరియు మందాకిని దేవి అనే ద్విపాత్ర‌ల‌తో మెప్పించ‌నున్నారు. ఇక ఈ రెండు పాత్ర‌ల్ని కీల‌కంగా క‌థ‌ను న‌డిపే విధంగా తీర్చిదిద్ద‌డంలో మ‌ణి స‌ర్ స్వార్థం చూపించార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. తాజా లీక్డ్ ఫోటోలో ఐశ్వ‌ర్యారాయ్ ని చూస్తుంటే శివ‌గామి రేంజు పాత్ర‌లో న‌టిస్తున్నార‌ని భావించ‌వ‌చ్చు.

ఐష్ గత వారం షూటింగ్ కోసం పుదుచ్చేరిలో చిత్రీక‌ర‌ణ ముగించి .. ప్రస్తుతం మధ్యప్రదేశ్ -ఓర్చాలో శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ సంద‌ర్భంగా ఐష్ సోష‌ల్ మీడియాలో ఒక అంద‌మైన నోట్ రాసారు. స్వర్ణ యుగం ప్రాణం పోసుకుంది. మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ తెర‌కెక్కుతోంది`` అని తెలిపారు. ఈ పీరియడ్ డ్రామా కల్కి కృష్ణమూర్తి ప్రముఖ చారిత్రక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, త్రిష కృష్ణన్- ప్రకాష్ రాజ్- జయరామ్- జయం రవి -ఐశ్వర్య లక్ష్మి తదితరులు నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది.