Begin typing your search above and press return to search.

అందమంటే ఐశ్వర్యదే అనేలా..!

By:  Tupaki Desk   |   11 Dec 2022 7:30 AM GMT
అందమంటే ఐశ్వర్యదే అనేలా..!
X
ఎంట్రీ ఇవ్వడంతోనే స్టార్ రేంజ్ కి వెళ్లే భామలు కొంతమందైతే సినిమా సినిమాకు తమ టాలెంట్ చూపిస్తూ క్రేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ కొంతమంది ఉంటారు. అలాంటి వారిలో చెన్నై చిన్నది ఐశ్వర్యా మీనన్ కూడా ఉంటుంది. మళయాళ మూలాలున్నా అమ్మడు పెరిగింది మొత్త తమిళనాడులోనే నటిగా మారింది కూడా అక్కడే. 2012లో తెరంగేట్రం చేసిన ఐశ్వర్య మీనన్ దశాబ్ధ కాలం అవుతున్నా సరే తగినంత క్రేజ్ తెచ్చుకోలేదని చెప్పొచ్చు.

తమిళంలోనే సినిమాలు చేస్తూ వచ్చిన ఈ అమ్మడు నిఖిల్ నటిస్తున్న స్పై సినిమాలో ఛాన్స్ అందుకుంది. కోలీవుడ్ లో ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న ఐశ్వర్య తెలుగులో కూడా సత్తా చాటాలని చూస్తుంది. మధ్యలో కన్నడ, మళయాల సినిమాలు చేసినా టాలీవుడ్ నుంచి ఒక్క అవకాశం కూడా రాలేదో లేక వచ్చినా ఆమే కావాలని చేయలేదో కానీ ఐశ్వర్య మీనన్ మాత్రం తెలుగు ఆడియన్స్ కి తన టాలెంట్ చూపించాలని ఫిక్స్ అయ్యింది.

కెరీర్ మొదలు పెట్టిన టైం లోనే సిద్ధార్థ్ లవ్ ఫెయిల్యూర్ సినిమాలో సైడ్ రోల్ లో నటించింది ఐశ్వర్య మీనన్. అది తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. అప్పట్లో సిద్ధార్థ్ సినిమాలకు తెలుగులో మంచి క్రేజ్ ఉండేది కదా అలా లవ్ ఫెయిల్యూర్ మూవీ తెలుగులో రిలీజ్ చేసినా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఇక ఇన్నాళ్లకు ఐశ్వర్య మీనన్ కు తెలుగు ఛాన్స్ వచ్చింది. నిఖిల్ స్పై పాన్ ఇండియా మూవీగా వస్తుంది.

ఈ సినిమాలో ఐశ్వర్య ఛాన్స్ అందుకోవడం ఆమె నిజంగానే లక్కీ అని చెప్పొచ్చు. తెలుగు ఆడియన్స్ గురించి అందరికి తెలిసిందే నచ్చిన సినిమానే కాదు నచ్చిన హీరోయిన్ ని కూడా వారు ఊహించని స్థాయిలో అందలం ఎక్కిస్తారు. సో ఐశ్వర్య మీనన్ కు తెలుగు నుంచి సూపర్ సపోర్ట్ అందుతుందని చెప్పొచ్చు. సినిమాలతో పాటుగా అమ్మడు ఫోటో షూట్స్ తో కూడా ప్రేక్షకులను దగ్గరవ్వాలని చూస్తుంది. లేటెస్ట్ గా షిప్ లో తన వయ్యారంతో అదరగొట్టేస్తుంది ఐశ్వర్య మీనన్. ఆరెంజ్ కలర్ డ్రెస్ తో థై షోస్ చేస్తూ అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.

సినిమాల్లో ఎంత టాలెంట్ చూపించినా ఇలా గ్లామర్ షో చేయనిదే హీరోయిన్స్ కి మనుగడ ఉండదని భావిస్తారు. అందుకే ఐశ్వర్య కూడా అదే దారిలో గ్లామర్ షోతో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.