Begin typing your search above and press return to search.
కళ్యాణ్ రామ్ సినిమాలో ఆమె ఔట్
By: Tupaki Desk | 25 Aug 2017 10:40 AM ISTఈ రోజుల్లోచాలామంది సినిమావాళ్లు హీరోయిన్స్ కి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదనే చెప్పాలి. కానీ హీరోయిన్స్ మాత్రం నటనాపరమైన సినిమా ఛాన్సులు వస్తే బావుండు అనుకుంటారు. అందుకే ఒక్కోసారి చిన్న సినిమానా పెద్ద సినిమా అని చూడకుండా ఒప్పేసుకుంటారు. కానీ కొందరు సినిమా దర్శక నిర్మాతలు అందంగా ఉంటే చాలు నటన అంతగా రాకపోయినా హీరోయిన్స్ ను ఫిక్స్ చేసేస్తారు.
అయితే రీసెంట్ గా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమా యూనిట్ సభ్యులు ఒక నవ హీరోయిన్ ని యాక్టింగ్ సరిగ్గా చేయడం లేదని సైలెంట్ గా షూటింగ్ లోంచి పంపించేశారట. రీసెంట్ గా మలయాళం లో రెండు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి అనే మలయాళం హీరోయిన్ ని కళ్యాణ్ రామ్ తో చేయబోయే సినిమాకు సెలెక్ట్ చేసుకున్నాడట దర్శకుడు జయేంద్ర. పూర్తి యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కబోయే ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైందట. దీంతో లక్ష్మి పై దర్శకుడు కొన్ని షాట్స్ చిత్రీకరిస్తుండగా ఆమె అనుకున్నంత స్థాయిలో నటించడంలేదని దర్శకుడు విసిగిపోయి ప్రాజెక్ట్ లో నుంచి తప్పించేశాడట. సాధారణంగా హీరోయిన్స్ నటన విషయంలో ఎవరు అంతగా పట్టించుకోరు. కానీ సినిమా కథ డిమాండ్ చేస్తే హీరోయిన్ ని నటనలో వాడుకోక తప్పదు. ఏ మాత్రం తేడా వచ్చినా ఫెయిల్ అవ్వడానికి ఒక్క కారణం చాలు.
మరి మలయాళంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి తెలుగులో ఛాన్స్ మిస్ చేసుకుందంటే చాలా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే మలయాళ ముద్దుగుమ్మలు టాలీవుడ్ ని చాలా సెంటిమెంట్ గా భావిస్తారు. ఇక్కడ ఒక్క హిట్ దక్కిందంటే చాలు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగినట్టే అనుకుంటారు. చూడాలి మరి లక్ష్మికి మరో లక్ అయినా దక్కుతుందో లేదో.. వెయిట్ అండ్ సి.