Begin typing your search above and press return to search.

దుమారం రేపుతున్న ర‌జినీ కూతురి డ్యాన్స్

By:  Tupaki Desk   |   12 March 2017 5:41 PM GMT
దుమారం రేపుతున్న ర‌జినీ కూతురి డ్యాన్స్
X
సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ కూతుళ్లిద్ద‌రూ కూడా బ‌హుముఖ ప్ర‌జ్ఞ‌శాలులే. అందులోనే పెద్ద‌మ్మాయి ఐశ్వ‌ర్య‌లో చాలా క‌ళ‌లున్నాయి. ఆమె ట్విట్ట‌ర్ పేజీ ఓపెన్ చేస్తే రైట‌ర్ అని.. డైరెక్ట‌ర్ అని.. క్లాసిక‌ల్ డ్యాన్స‌ర్ అని ఉంటుంది. ర‌చ‌యిత‌గా.. ద‌ర్శ‌కురాలిగా ఆమె త‌నేంటో ఇప్ప‌టికే రుజువు చేసుకుంది. తొలి సినిమా ‘3’ తేడా కొట్టినా ‘వై రాజా వై’ తో స‌క్సెస్ సాధించింది. ఐతే ఐశ్వ‌ర్య శాస్త్రీయ నృత్య ప్ర‌తిభ గురించి ఇప్ప‌టిదాకా జ‌నాల‌కు తెలియ‌దు. ఐతే తాజాగా ఆమె త‌న టాలెంట్ చూపించింది.

స్త్రీ పురుష స‌మాన‌త్వం.. మ‌హిళా సాధికార‌త‌కు సంబంధించి ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్న ఐశ్వ‌ర్య మార్చి 8న మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా న్యూయార్క్ లోని ఐక్య‌రాజ్య స‌మితి ప్ర‌ధాన కార్యాల‌యంలో భ‌ర‌త నాట్యం ప్ర‌దర్శ‌న ఇచ్చింది. ఐతే అక్క‌డ ఆమె డ్యాన్స్ న‌వ్వుల పాలైంది. భ‌ర‌త‌నాట్యంపై అవ‌గాహ‌న లేని వాళ్లు ఒకట్రెండు రోజులు రిహార్స‌ల్స్ చేసి డ్యాన్స్ చేసిన‌ట్లుగా ఉంది ఆమె డ్యాన్స్. ఒక ప్ర‌ముఖ నృత్యాకారిణి ఈ డ్యాన్స్ వీడియో షేర్ చేసి.. భ‌ర‌త‌నాట్యానికి జ‌రిగిన అవ‌మానం ఇదంటూ విమ‌ర్శలు గుప్పించింది.

దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలోకి రాగానే ఐశ్వ‌ర్యపై పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ మొద‌ల‌య్యాయి. అస‌లే త‌మిళ‌నాట హీరోల‌కు యాంటీ ఫ్యాన్స్ ఎక్కువ‌. ధ‌నుష్ కు కూడా అలాంటి యాంటీ ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. ఇప్పుడు వాళ్ల‌కు మంచి ఛాన్స్ దొరికింది. సోష‌ల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. ఐశ్వ‌ర్య డ్యాన్స్ మీద జోకులు పేలుస్తూ.. పేర‌డీలు చేస్తూ ఓ రేంజిలో ట్రోల్ చేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/