Begin typing your search above and press return to search.

యాపిల్ బాక్స్ మీద నుంచుంటే..

By:  Tupaki Desk   |   23 March 2016 9:30 AM GMT
యాపిల్ బాక్స్ మీద నుంచుంటే..
X
ఐశ్వర్యా ధనుష్.. ఈమె సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు. సౌత్ తో పాటు నార్త్ లోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో ధనుష్ కి భార్య. అంతే కాదు తానే స్వయంగా ఓ డైరెక్టర్. ఇన్ని లక్షణాలు ఉన్న ఈమె ప్రస్తుతం ఓ పుస్తకం రాస్తోంది. తను రాస్తున్న బుక్ ని తండ్రి పుట్టిన రోజైన డిసెంబర్ 12న విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది ఐశ్యర్య.

'స్టాండింగ్ ఆన్ యాన్ యాపిల్ బాక్స్'.. ఇదీ ఆ పుస్తకం టైటిల్, దీనిలో అన్నీ తనకు సంబంధించిన విషయాలే ఉంటాయని చెబుతోంది ఐశ్వర్య. 'సెలబ్రిటీల పిల్లల జీవితాలు తమకంటే ఉన్నతంగా గొప్పగా భోగభాగ్యాలతో ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ అందులో వాస్తవం ఏ మాత్రం ఉండదు. మేం కూడా సాధారణంగానే జీవనం సాగిస్తాం. ఆవిషయాలనే పుస్తకంలో వివరించే ప్రయత్నం చేస్తున్నా'అంటోంది ఐశ్వర్య. అయితే ఇదేమీ తన ఆటో బయోగ్రఫీ కాదని..అలాగని కల్పితం కూడా కాదన్న ఐశ్వర్య.

సెమీ ఆటోబయోగ్రఫీ అనుకోవచ్చని చెప్పింది. తనకు ఈ పుస్తకం చాలా ముఖ్యమని.. రైటర్ గా మారేందుకు సినిమాలను కూడా వదిలేసి ఇటువైపే దృష్టి పెట్టానని ఆమె అంటోంది. తన చిన్న నాటి జీవితం - పేరెంట్స్ అనుబంధం - ఇంట్లో ఉండే తీరు - పెళ్లి నాటి పరిస్థితులు.. ఇలా తన జీవితానికి సంబంధించిన కొన్ని సంఘటనలను కథల రూపంలో అందించే ప్రయత్నం చేశానని చెప్పింది ఐశ్వర్యా ధనుష్.