Begin typing your search above and press return to search.

ధనుష్ వైఫ్ ట్యాలెంట్ చూపించింది

By:  Tupaki Desk   |   10 Sep 2016 7:30 PM GMT
ధనుష్ వైఫ్ ట్యాలెంట్ చూపించింది
X
సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య.. కోలీవుడ్ హీరో ధనుష్ వైఫ్ అనే సంగతి తెలిసిందే. ఈమెకు చాలా రంగాల్లోనే ట్యాలెంట్ ఉంది. సింగర్ గా.. వాయిస్ ఆర్టిస్ట్ గా.. స్క్రీన్ ప్లే రైటర్ గా.. డైరెక్టర్ గా కూడా సినీ రంగంలో ట్యాలెంట్ చూపించిన ఐశ్వర్యా ధనుష్.. గతేడాది ఓ పెద్ద హిట్ కూడా కొట్టింది. ఇంటర్నెట్ లో సెన్సేషన్స్ సృష్టించిన 'వై దిస్ కొలవెరి' పాట ఉన్న 3 మూవీ ఈమె డైరెక్షన్ లో వచ్చినదే.

ఇక ఈమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా. చాలా రేర్ గా డ్యాన్స్ గా పెర్ఫామెన్స్ లు కూడా ఇస్తూ ఉంటుంది. గతంలో తమిళనాడు రాష్ట్రప్రభుత్వం నుంచి కలైమామణి అవార్డ్ కూడా అందుకున్న భరతనాట్యం నాట్యకారిణి ఐశ్వర్యా ధనుష్. రీసెంట్ గా ఈమె ఓ డ్యాన్స్ ప్రోగ్రాం ఇచ్చింది. ఈ కార్యక్రమం స్పెషాలిటీ ఏంటంటే.. ఐశ్వర్య తన గురువు మీనాక్షి చిత్తరంజన్ తో కలిసి ప్రదర్శన ఇవ్వడం. ఇలా గురు-శిష్యురాలు ఇద్దరూ కలిసి చేసిన నృత్యం అందరినీ అలరించింది.

అక్క ఐశ్వర్య డ్యాన్స్ ప్రోగ్రాం గురించి చెల్లి సౌందర్య బోలెడంత హ్యాపీగా షేర్ చేసుకుంది. 'మల్టిపుల్ ట్యాలెంట్ ఉన్న అక్కడ మళ్లీ డ్యాన్స్ లో ట్యాలెంట్ చూపించింది. తన గురువు.. నాకు ఇష్టమైన ఆంటీ మీనాక్షి చిత్తరంజన్ ల ప్రదర్శనతో ఈ షో ఆకట్టుకుంది' అని చెబుతోంది రజినీ చిన్న కూతురు సౌందర్య.