Begin typing your search above and press return to search.

ఐషాకి అక్కడైనా కాలం కలిసొచ్చేనా?

By:  Tupaki Desk   |   16 Jun 2016 1:30 PM GMT
ఐషాకి అక్కడైనా కాలం కలిసొచ్చేనా?
X
కొన్నిసార్లు వెనక నుంచి ఎంత సపోర్ట్ చేసినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఏదో జరగబోతోందని ఎదురుచూస్తూనే ఉంటారు. బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ చిట్టి చెల్లెలు ఐషా శర్మ పరిస్థితి ఇలాగే ఉంటుంది. టాలీవుడ్ లో చెర్రీ పక్కన చిరుతతో అరంగేట్రం చేసిన నేహ.. బాలీవుడ్ లో బాగానే పాగా వేసింది. అదే రూట్ లో చెల్లెలు ఐషాను కూడా ముందు ఇక్కడికే పంపింది.

ఎనర్జిటిక్ హీరో రామ్ మూవీ శివంలో మొదట అనుకున్నది ఐషా శర్మనే. ఆ తర్వాత ఈ రోల్ రాశి ఖన్నాకి వెళ్లిపోయింది. పోనీలే పూరీ జగన్నాథ్ హీరోయిన్ అనిపించుకోవచ్చులే అని సరిపెట్టుకుంటే.. రోగ్ నుంచి కూడా తప్పుకోవాల్సి వచ్చింది. ఇక టాలీవుడ్ తోను, సౌత్ సినిమాతోను లాభం లేదనుకుని.. బాలీవుడ్ లో గట్టి ప్రయత్నాలే చేసింది ఐషా శర్మ. లక్కీగా ఈ అమ్మడికి బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ ఛాన్స్ ఇచ్చేశాడు.

సోనాక్షి సిన్హా లాంటి టాప్ హీరోయిన్ నమస్తే ఇంగ్లాండ్ లో నటిస్తున్నా.. అక్షయ్ కి జోడీగా చేసే ఛాన్స్ రావడమంటే చిన్న విషయం కాదు. ఇప్పటికే కేలండర్ గాళ్ గా మాంచి రసవత్తరమైన పోజులిచ్చి కుర్రాళ్లను ఆకట్టుకున్న ఐషా శర్మ.. సెల్ఫీల విషయంలో బాగా ముదురు. ఇలాంటి సెల్ఫీలను ఇన్ స్టాగ్రామ్ లో చాలానే ఉంచింది. హాట్ ఘాటు సెల్ఫీలను అభిమానులకు అందిస్తున్న ఐషా శర్మకు.. క్రేజ్ బాగానే ఉందని చెప్పచ్చు.