Begin typing your search above and press return to search.

చిరుత పిల్ల చెల్లి.. చెలరేగిపోతోంది

By:  Tupaki Desk   |   2 Nov 2016 4:05 AM GMT
చిరుత పిల్ల చెల్లి.. చెలరేగిపోతోంది
X
చిరుత మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఆడిపాడిన హీరోయిన్ నేహా శర్మ.. ఆ తర్వాత తెలుగులో ఒక్క మూవీ మాత్రమే చేసింది. హిందీలో వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. ఒకవైపు ఈ అమ్మడు ఇలా చెలరేగిపోతూనే ఉండగా.. మరోవైపు చెల్లెలు కూడా రంగంలోకి దిగిపోయింది.

నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మను కూడా దర్శకుడు పూరీ జగన్నాథ్ సినిమాతోనే సినీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పుడీ బ్యూటీ ఫోటో షూట్స్ తో కూడా రెచ్చిపోతోంది. స్కిన్ షో విషయంలో అక్కని మించిపోవడానికి ఈ భామ దగ్గర అభ్యంతరాలు ఏమీ లేవనే విషయాన్ని చూపించేస్తోంది కూడా. బ్లాక్ కలర్ షార్ట్ గార్మెంట్స్ ని మాత్రమే ధరించి.. చేతికి గ్లౌవ్స్.. చేతిలో బెల్ట్ తో.. మరో చిరుత రేంజ్ లో రెచ్చిపోతోంది ఐషా శర్మ.

రోగ్ అంటూ తెలుగు-కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుండగా.. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు ఫినిషింగ్ దశకు వచ్చింది. ఫైనల్ టచెస్ మినహా.. ఈ మూవీ పూర్తయిపోగా.. ఈ మూవీ రిలీజ్ కోసం అమ్మడు ఆత్రంగా ఎదురుచూస్తోంది. మరి ఈ భామయినా కాస్త పేరొచ్చాక ఇక్కడుంటుందో.. లేక అక్కని ఇన్ స్పిరేషన్ తీసుకుని ఎగిరిపోతుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/