Begin typing your search above and press return to search.

అథ్లెట్ అండ్ సైక్లిస్ట్ కం హాటీ `చీతా`వ‌తారం

By:  Tupaki Desk   |   6 Jan 2021 1:29 PM IST
అథ్లెట్ అండ్ సైక్లిస్ట్ కం హాటీ `చీతా`వ‌తారం
X
బాలీవుడ్ లో అగ్ర నాయిక‌లుగా ఎదిగేందుకు శ‌ర్మ సిస్ట‌ర్స్ చేస్తున్న ప్ర‌య‌త్నం అంతా ఇంతా కాదు. నిజానికి మెయిన్ స్ట్రీమ్ క‌థానాయిక‌ల‌కు ధీటుగా .. స‌త్తా చాటే అందం చందం ఉన్నా కానీ ఎందుక‌నో నేహా శ‌ర్మ పెద్ద స్టార్ కాలేక‌పోయింది. చిరుత చిత్రంతో టాలీవుడ్ లో ప్ర‌వేశించిన ఈ బ్యూటీ ఆ త‌ర్వాత ఇక్కడ క‌నుమ‌రుగై బాలీవుడ్ కే అంకిత‌మైంది. ఇక త‌న సోద‌రి ఐషా శ‌ర్మ‌ను బ‌రిలో దించిన ఈ బ్యూటీ ఇటీవ‌ల ప్ర‌చారం ప‌రంగా ఇత‌ర నాయిక‌లకు ధీటుగా ముందుంటోంది.

ఏడాది కాలంగా సోష‌ల్ మీడియాల్లో శర్మా సిస్ట‌ర్స్ లో ఐషా జ‌రంత స్పీడ్ గా ఉంది. వరుస‌ ఫోటోషూట్ల దుమారానికి తెర తీస్తోంది. నిరంత‌రం జిమ్మింగ్ స్విమ్మింగ్ ఫోటోలు వీడియోలతో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ కి సంబంధించిన ఫోటోల‌తోనూ ఈ భామ‌ ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు.

ఐషా శ‌ర్మ అథ్లెట్ సైక్లిస్ట్ కం జిమ్నాస్ట్ అన్న సంగ‌తి తెలిసిన‌దే. అందుకు సంబంధించిన ఈ భామ నిరంత‌ర ఫోటోషూట్లు ఇప్ప‌టికే వైర‌ల్ అయ్యాయి. సైక్లిస్టుగా ఇంత‌కుముందు రేసింగ్ కి వెళ్లిన ఫోటోల్ని ఐషా షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. ఐషా లేటెస్ట్ జిమ్ యోగా ఫోటోలు ఇన్ స్టాలో హీట్ పెంచుతున్నాయి. తాజాగా మ‌నోహ‌ర‌మైన ఐషా శ‌ర్మ చీతా త‌ర‌హా డిజైనర్ లుక్ తో క‌నిపించింది. స్మైలీ ఐషా ప్లెజెంట్ లుక్ యూత్ లోకి దూసుకెళుతోంది. జాన్ అబ్ర‌హాం స‌ర‌స‌న స‌త్య‌మేవ జ‌య‌తే లాంటి క్రేజీ చిత్రంలో ఐషా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ మూవీ రిలీజ్ కి రానుంది.