Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: చిరుతపిల్ల చెల్లి ఆరేసేసింది

By:  Tupaki Desk   |   28 Feb 2018 2:13 PM GMT
ఫోటో స్టోరీ: చిరుతపిల్ల చెల్లి ఆరేసేసింది
X
మెగా పవర్ స్టార్ తో చిరుత సినిమాలో కనిపించిన నేహా శర్మ.. మన ఆడియన్స్ కి బాగానే తెలుసు. ఇక్కడ ఒకట్రెండు ట్రయల్స్ వేసి బాలీవుడ్ చెక్కేసిన ఈ భామ.. ఇప్పుడు తన చెల్లి ఐషా శర్మను కూడా లైన్ లోకి తీసుకొచ్చేసింది. ఇప్పటికే ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో బోలెడంత క్రేజ్ ఉంది.

అందాల ఆరబోతలు.. బికినీ ఫోటో షూట్స్.. కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో సోయగాల ప్రదర్శనలు.. సోషల్ మీడియాలో రివీలింగ్ ఫోటోలు.. అబ్బో ఈ పిల్ల చేసే హంగామా మామూలుగా ఉండదు. ఇప్పుడు కూడా ఇదే పనిలో ఉంది. తన షోకుల ప్రదర్శన చేస్తున్న ఓ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది ఐషా శర్మ. బ్లాక్ డ్రెస్ లో ఈ భామ కనిపిస్తున్న లుక్ అదిరిపోతున్నా.. అందరి లుక్కులు అందాలవైపు వెళ్లిపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. అంతగా తన ఫోటోతో మాయ చేసేస్తోంది ఐషా శర్మ.

పైగా ఇదంతా తన గొప్పదనం కాదు అన్నట్లుగా.. కొందరు కెమేరా లెన్స్ ఎంత అద్భుతంగా పని చేస్తాయని.. ఆ ఫోటోగ్రాఫర్ కి తాబు కూడా ఇచ్చేసింది. పనిలోపనిగా తనను ఇంత అందంగా తయారు చేసిన ఇతర మేకప్ పర్సన్స్ ని కూడా పొగిడేసింది. నిజానికి ఈ భామ పూరీ జగన్ తీసిన రోగ్ సినిమాతోనే మనకు కనిపించి ఉండాల్సింది కానీ.. అప్పట్లో టెర్మ్స్ కుదరలేదు. మరి ఎప్పటికి ఈ అందాలను టాలీవుడ్ తీసుకొస్తుందో?