Begin typing your search above and press return to search.

అక్క తరువాత చెల్లితోనా చెర్రీ??

By:  Tupaki Desk   |   26 Nov 2015 4:00 AM IST
అక్క తరువాత చెల్లితోనా చెర్రీ??
X
ఇప్పటివరకు రామ్‌ చరణ్‌ అత్యధికంగా పనిచేసిన హీరోయిన్‌ ఎవరైనా ఉన్నారా అంటే.. వెంటనే కాజల్‌ పేరే మనకు వినిపిస్తుంది. అమ్మడు చెర్రీతో ఓ నాలుగు సినిమాల్లో తళుక్కుమంది. అయితే ఇప్పుడు రామ్‌ చరణ్‌ కు మరోసారి హీరోయిన్‌ ను ఎంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే ఈసారి అందరికీ తెలిసిన చిన్న రోల్‌ కాబట్టి.. స్టార్‌ హీరోయిన్లు కాస్త గాట్టిగానే డిమాండ్‌ చేయొచ్చు. మరి తని ఒరువన్‌ సినిమా రీమేక్‌ కోసం ఎవర్ని తీసుకుంటాడు అంటారా?

నిజానికి అమైరా దస్తూర్‌ తో ఈ రోల్‌ చేయించాలని అనుకున్నారు. ఎందుకంటే ఆమె మిష్టర్‌ ఎక్స్‌ సినిమాల్లో ఒక ప్రక్కన పోలీసు క్యారెక్టర్ లో మెరుస్తూనే మరో ప్రక్కన బికినీలో తడసి ముద్దయ్యింది. మేబీ మనోళ్ళకు అది నచ్చిందేమో. కాని ఇంకా ఆమెను కన్ఫమ్‌ చేయలేదు. కుదిరితే కాజల్‌ అని మళ్లీ చరణ్‌ చెబుతున్నాడు అంటూ ఒక రూమర్‌ వినిపిస్తోంది. ఇవన్నీ కాకపోతే చిరుత సినిమాలో తనతో ఆడిపాడిన నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మను తీసుకుందాం అంటున్నాడట. అక్క తరువాత చెల్లితో కూడా చరణ్‌ రొమన్స్‌ చేసేస్తాడేమో చూడాల్సిందే.

ఇకపోతే ప్రస్తుతం సురేందర్‌ రెడ్డి లీడర్‌ షిప్‌ లో తనిఒరువన్‌ రీమేక్‌ స్ర్కిప్టును రచిస్తున్నారు. సినిమా జనవరి నుండి మొదలవుతుందని ఒక టాక్‌. అది సంగతి.