Begin typing your search above and press return to search.

ఇన్ స్టాలో ఐషా శ‌ర్మ మంట‌లు

By:  Tupaki Desk   |   3 Nov 2021 11:30 AM GMT
ఇన్ స్టాలో ఐషా శ‌ర్మ మంట‌లు
X
బాలీవుడ్ బ్యూటీ నేహాశ‌ర్మ సిస్ట‌ర్ ఐషా శ‌ర్మ ఫిట్నెస్ ఫ్రీక్ గా ఇన్ స్టా మాధ్య‌మంలో దూసుకెళుతున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ప‌రంగా త‌న సోద‌రి నేహా శ‌ర్మ‌లా ఇంకా స్పీడ్ అందుకోలేదు. చ‌దువు పూర్తిచేసుకుని ఐషా శ‌ర్మ‌ మోడ‌లింగ్ రంగంలోకి అడుగు పెట్టి అటుపై క్యాలెండ‌ర్ గాళ్ గా వెలిగింది. అయినా ఈ బ్యూటీకి అవ‌కాశాలు అంత‌గా రాలేదు. దీంతో పాప్ ఆల్బ‌మ్స్ లోనూ అందాలు విందు చేసింది. ఆ క్ర‌మంలోనే `స‌త్య‌మేవ జ‌య‌తే` లో ఛాన్స్ అందుకుంది. కానీ కెరీర్ మాత్రం స్పీడ్ అందుకోలేదు. దీంతో సిస్ట‌ర్ నేహా శ‌ర్మ రంగంలోకి దిగింది. చెల్లెల్ని కాస్త షెన‌ప్ చేయాల‌ని కొన్ని ర‌కాలు టిప్స్ ఇచ్చింది. కొన్ని నెలలుగా నేహాశ‌ర్మ అయేషా కెరీర్ విష‌యంలోనే కాన్సంట్రేట్ చేసి ప‌నిచేస్తోంది.

అవ‌కాశాలు ఇప్పించాల‌ని త‌నకున్న ప‌రిచ‌యాల్ని కూడా సద్వినియోగం చేసుకుంటున్న‌ట్టు ఇటీవ‌లే బాలీవుడ్ మీడియా లో క‌థ‌నాలొచ్చాయి. ఇలా ఓ అక్క‌డా చెల్లెలి కోసం చేయాల్సిందంతా చేస్తోంది. కానీ అమ్మ‌డి కెరీర్ మాత్రం న‌త్త‌న‌డ‌క‌నే సాగుతోంది. ఆ సంగ‌తులు ప‌క్క‌న‌బెడితే ఐషా శ‌ర్మ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. లేటెస్ట్ హాట్ ఫోటోల‌తో మంట‌లు పెట్ట‌డం త‌న ప్ర‌త్యేక‌త అని నిరూపించింది. చిట్టి పొట్టి నిక్క‌ర్ల‌లో బికినీ..టూపీస్ ల‌లో టూ మ‌చ్ గా ర‌చ్చ చేయ‌డం ఐషాకి తొలి నుంచి అల‌వాటు. తాజాగా అమ్మ‌డు మ‌రోసారి చెల‌రేగిపోయింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఓర చూపులతో గుబులు రేపుతోంది. ఈ ఫోటోని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది.

ఇందులో ఐషా శ‌ర్మ బ్లాక్ క‌లర్ డిజైన‌ర్ లుక్ లో క‌నిపించింది. టాప్ పై మ్యాచింగ్ కోట్ ధ‌రించింది. కిల్ల‌ర్ గ్లామ్ ని ఎలివేట్ చేస్తూ..కిల్లింగ్ లుక్స్ తో మంట‌లు రేపుతోన్న ఓ సెల్ఫీని ఫాలోవ‌ర్స్ కోసం షేర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఈ లుక్ పై ఆక‌తాయిల కామెంట్లు హ‌ద్దులు మీరుతున్నాయి. ఎన్ని చేసినా కానీ నేహాలా దూసుకెళ్లాలంటే చెల్లి ఐషా ఇంకా చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది మ‌రి.