Begin typing your search above and press return to search.

క్రేజీ ఆఫ‌ర్లు వ‌దిలేసి చివ‌రికి ఆ హీరోతో

By:  Tupaki Desk   |   7 March 2018 1:30 PM GMT
క్రేజీ ఆఫ‌ర్లు వ‌దిలేసి చివ‌రికి ఆ హీరోతో
X
నేహా శ‌ర్మ అన‌గానే గుర్తు రాక‌పోవ‌చ్చు... అదేనండి రామ్‌చ‌ర‌ణ్ మొద‌టి సినిమా చిరుత‌లో న‌టించిన పిల్ల‌. ఇప్పుడు గుర్తొచ్చిందిగా. ఆ అమ్మ‌డికి టాలీవుడ్ల పెద్ద‌గా క‌లిసిరాలేదు. ఓ రెండు మూడు సినిమాలు చేసి చెక్కేసింది. పోనీ బాలీవుడ్లో ఉన్నాయా అంటే అదీ లేదు. అక్క‌డ కూడా అర‌కొర‌. ఇప్పుడు ఆ హీరోయిన్ చెల్లి కూడా తెరంగేట్రానికి సిద్ధ‌మైపోయింది. ఫ్లాప్ హీరోతో సినిమా చేయ‌డానికి ఒప్పేసుకుంది.

ఐషా శ‌ర్మ... నేహా శ‌ర్మ చెల్లెలు. అక్క‌లాగే అందంగా... గ్లామ‌ర్‌గా ఉంటుంది. గ‌త రెండేళ్లుగా ఆమె ఎంట్రీ ఇస్తోందంటూ వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. కానీ ఇప్ప‌టికీ ఒక్క సినిమాలో కూడా న‌టించ‌లేదు. తెలుగులోనే ఆమెకు బోలెడు సినిమా ఆఫ‌ర్లు వ‌చ్చాయి. పూరీ జ‌గ‌న్నాథ్ తీసిన రోగ్ సినిమాలో మొద‌ట ఆమెనే అనుకున్నారు. షూటింగ్ లో కూడా కొన్ని రోజులు పాల్గొంది. సినిమా అట్ట‌ర్ ఫ్లాఫ‌వుతుంద‌ని ముందే ఊహించిందో ఏంటో... సినిమా నుంచి త‌ప్పుకుంది. దీంతో మ‌రో హీరోయిన్‌ను వెతికి సినిమా పూర్తి చేసేస‌రికి చాలా లేట‌య్యింది... ఆ త‌రువాత రామ్ ప‌క్క‌న హీరోయిన్‌ గా ఎంపికైంది. రెండు రోజులు షూటింగ్ కు వ‌చ్చి చెక్కేసింది. వాళ్లు కొత్త హీరోయిన్‌ ను వెతుక్కున్నారు.

ఇన్నాళ్ల త‌రువాత ఆమెను ఇప్ప‌టికీ ఓ సినిమాకు సైన్ చేసింది. గత కొన్నేళ్లుగా ఒక్క హిట్టు కూడా లేని జాన్ అబ్ర‌హాం ప‌క్క‌న ఆమె న‌టించ‌నుంది. ఈ మేర‌కు ఆమె కూడా క‌న్ఫార్మ్ చేసింది. పోయిపోయి ఓ ఫ్లాప్ హీరోను ఎంచుకుందేంటీ పాప అని చ‌ర్చించుకుంటున్నారు బాలీవుడ్ జ‌నాలు. క‌థ మీద న‌మ్మ‌కంతోనే అలాంటి నిర్ణ‌యం తీసుకుందేమో ఐషా.