Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ ఇంటికి ఎగిరొచ్చిన 'క‌బాలి విమానం'

By:  Tupaki Desk   |   16 Feb 2019 5:01 AM GMT
ర‌జ‌నీ ఇంటికి ఎగిరొచ్చిన క‌బాలి విమానం
X
గాల్లో సిగ‌రెట్ ఎగుర‌వేస్తే అది ఎగిరొచ్చి పెద‌వి అంచుపై పొందిగ్గా కూచోవాలి. ఆ క‌నుసైగ‌కే త‌ల‌వెంట్రుక‌లు గాలికి ఎగ‌రి హ‌లో చెప్పాలి. ఇలాంటి స్టైల్ ఎవ‌రికి సాధ్యం? అంటే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి మాత్ర‌మే సాధ్యం. బ‌స్ కండ‌క్ట‌ర్ గా ఉన్న రోజుల్లోనే ఆయ‌న స్టైల్ కి ఫిదా అయిపోయి మీరు సినిమా హీరో అవ్వాలి సారూ! అంటూ ఎంక‌రేజ్ చేశారు కొలీగ్స్. ర‌జ‌నీ ప్ర‌తి అడుగు నేటిత‌రానికి స్ఫూర్తివంతం. ఒక సాధార‌ణ కండ‌క్ట‌ర్ ఇంతింతై అన్న చందంగా అత‌డు అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని అందుకున్న తీరు ఎంద‌రికో బిగ్ లెస్స‌న్. ఇండియాతో పాటు అమెరికా - బ్రిట‌న్ - జ‌పాన్ - ఆస్ట్రేలియా - న్యూజిల్యాండ్ లోనూ ర‌జ‌నీకి వీరాభిమానులు ఉన్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

తాజాగా ర‌జ‌నీ 2.0 మీమ్ ఒక‌టి ఆస్ట్రేలియన్ పోలీస్‌ కి దారి చూపించ‌డం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కొచ్చింది. ఓ డ్రంక్ & డ్రైవ్ కేసులో .. ర‌జ‌నీ మీమ్‌ ఆస్ట్రేలియా డెబ్రీ పోలీస్ కే గొప్ప ఐడియాని ఇచ్చిందిట‌. ఆప‌రేషన్ టేబుల్ పై మ‌త్తు ముందు పుచ్చుకున్నంత‌.. కోమాలోకి వెళ్లేంత‌గా తాగిన ఓ ఆసామి బాడీలో 0.341 ప‌ర్సంట్ ఆల్క‌హాల్ ఉందిట‌. దీనికి స‌ర్‌ ప్రైజ్ అయిన పోలీస్ ర‌జ‌నీకాంత్ 2.0 మీమ్ తో చాలానే కామెడీ చేస్తున్నారు. బ్రీథ్ ఎన‌లైజ‌ర్ షేక‌య్యే ట్రీట్ ఇచ్చిన ఆల్క‌హాల్ ప్ర‌బుద్ధుల‌కు ర‌జ‌నీ స‌ర్‌ ప్రైజ్‌ మీమ్ (2.0) ని ఉప‌యోగించ‌డం ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ లో ఆస‌క్తి రేకెత్తించింది. అభిమానులు డెబ్రీ పోలీస్ చేసిన ట్వీట్స్ ని జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. ఇప్ప‌టికే 1100 లైక్స్ - 600 రీట్వీట్లు వ‌చ్చాయిట‌. మొత్తానికి ఖండాంత‌రాల్లో సూప‌ర్ స్టార్ ఖ్యాతి అమాంతం ఇంకా ఇంకా పెరుగుతోంద‌న‌డానికి ఇదే సూచిక‌. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ ర‌జ‌నీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక మ‌రో ఈవెంట్ లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ ఇంటికి ఎయిర్ ఇండియా ఎయిర్ క్రాఫ్ట్ ఎగిరొచ్చి స‌లాం చేసింది. అదెలా అంటారా? నిన్న‌టిరోజున ర‌జ‌నీకాంత్ ఇంటికి ఎయిర్ ఏసియా కి చెందిన ప్ర‌తినిధి ఒక‌రు `క‌బాలి లివ‌రి` పేరుతో ఓ ఎయిర్ క్రాఫ్ట్ ని తీసుకొచ్చి కానుక‌గా ఇచ్చి వెళ్లారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్ పై క‌బాలి పోస్ట‌ర్ ద‌ర్శ‌న‌మీయ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు ఫ్యాన్స్ సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. మొత్తానికి క‌బాలితో ర‌జ‌నీ పాపులారిటీ త‌క్కువేమీ కాద‌ని ప్రూవైంది. ర‌జ‌నీ రాజ‌కీయారంగేట్రం నేప‌థ్యంలో అత‌డికి భారీ కార్పొరెట్ బ్యాక‌ప్ ల‌భిస్తోంద‌నేందుకు ఇదే సూచిక కావొచ్చు.