Begin typing your search above and press return to search.

కబాలి విమానాలే కాదు.. సిమ్‌ కార్డులు కూడా

By:  Tupaki Desk   |   12 July 2016 6:01 AM GMT
కబాలి విమానాలే కాదు.. సిమ్‌ కార్డులు కూడా
X
సినిమా ప్రమోషన్లు కొత్త పుంతలు తొక్కుతుండడం చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో ఇన్ ఫిలిం బ్రాండింగ్ కూడా బాగా ఊపందుకుంటోంది. ఇప్పటికే ఈ కల్చర్ ఉన్నా.. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి విషయంలో మాత్రం టాప్ రేంజ్ కి చేరబోతోంది. ఇప్పటికే కబాలి టీంతో ఒప్పందంలో భాగంగా విమానయాన సర్వీసుల కంపెనీ ఎయిరేషియాతో బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తోంది.

ఇప్పుడు టెలికామ్ జెయింట్ ఎయిర్టెల్ కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయింది. త్వరలో కబాలి స్పెషల్ సిమ్ కార్డులను ఎయిర్ టెల్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా కొత్తగా విడుదల చేసే కబాలి సిమ్ కార్డులు కొనుక్కునే వారికి స్పెషల్ ప్యాకేజీలు.. టాక్ టైమ్ ఆఫర్లు.. ప్రత్యేక వాల్ పేపర్లను రిలీజ్ చేయనున్నారట. పాత కస్టమర్లకు కూడా కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ ఇచ్చే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశంలో నెలకొన్న కబాలి మేనియాని కార్పొరేట్ కంపెనీలు బాగానే క్యాష్ చేసుకునేందుకు ప్లాన్స్ చేసుకుంటున్నాయి.

ఇప్పుడు కబాలి రిలీజ్ కి మరో 10 రోజుల సమయం ఉండడంతో.. ఇలాంటి బ్రాండ్ ప్రమోషన్స్ మరిన్ని సెట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కంటెంట్ క్లిక్ అయి మూవీ కమర్షియల్ హిట్ సాధిస్తే మాత్రం.. ఈ తరహా డీలింగ్స్ కు కబాలి ఊపునివ్వడం ఖాయం.