Begin typing your search above and press return to search.

మరో సూపర్ హిట్ ఎయిర్ లిఫ్ట్

By:  Tupaki Desk   |   30 Jan 2016 7:00 PM IST
మరో సూపర్ హిట్ ఎయిర్ లిఫ్ట్
X
ఎనిమిది రోజుల్లో 88 కోట్లు.. ఇదేమీ మాస్ మసాలా మూవీ కాదు - రొమాంటిక్ స్టోరీ కాదు - కామెడీ సిరిస్ అంతకంటే కాదు.. ప్రజలు ఎదుర్కొన్న ఓ నిజమైన సమస్యపై తీసిన హిస్టారికల్ మూవీ. హిస్టరీ అంటే అదేమీ మనకు తెలియనిది అసలు కాదు. ప్రపంచంలోనే అతి పెద్ద మానవ తరలింపుగా రికార్డుల్లోకెక్కిన గల్ఫ్ సమస్య. ఈ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించిన ఎయిర్ లిఫ్ట్ మూవీ.. కలెక్షన్లలోనూ సంచలనం సృష్టిస్తోంది.

ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే 88 కోట్ల వసూళ్లను సాధించింది. మొదటి రోజున 12.35 కోట్లు - రెండో రోజు శనివారం 14.6 కోట్లు - ఆదివారం 17.35 కోట్లు చొప్పున రిలీజ్ చేసిన ఎనిమిదో రోజున కూడా 5 కోట్ల వసూళ్లను సాధించడమంటే.. రాక్ స్టడీగా ఉన్నాయని చెప్పాల్సిందే. ఎయిర్ లిఫ్ట్ కి అంతర్జాతీయంగా వచ్చిన వసూళ్లే 26.53కోట్లు ఉన్నాయంటే.. ఈ మూవీ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో అర్ధమవుతుంది. అక్షయ్ కుమార్ నటన సూపర్బ్ గా ఉండగా.. ఒక వాస్తవాన్ని ప్రపంచానికి చూపించిన విధానం చాలా ఆకట్టుకుంటోంది. లక్షలాది మంది ప్రజలు పడ్డ కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపించిన విజువల్స్ ను మార్వలెస్ అంటున్నారు ప్రేక్షకులు.

అంతే కాదు.. మ్యూజిక్ పరంగా కూడా ఎయిర్ లిఫ్ట్ బాగా ఆకట్టుకుంది. త్వరలో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోనున్న ఎయిర్ లిఫ్ట్.. అక్షయ్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలుస్తోంది. పాజిటివ్ రివ్యూలతో పాటు అంతకంటే ఎక్కువగా మంచి మౌత్ టాక్ ఈ మూవీ స్ట్రాంగ్ వసూళ్లకు కారణమవుతున్నాయి.