Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మూవీ కొత్త పోస్టర్ రిలీజ్

By:  Tupaki Desk   |   20 May 2020 12:30 PM GMT
పాన్ ఇండియా మూవీ కొత్త పోస్టర్ రిలీజ్
X
టాలీవుడ్లో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, డిఫరెంట్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. దాదాపు మూడేళ్ళ విరామం తరవాత ఒక పవర్‌ఫుల్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా ప్రస్తుతం 'అహం బ్రహ్మాస్మి' అనే సినిమా తెరకెక్కుతోంది. తన సొంతంగా ఎంఎం ఆర్ట్స్ నిర్మాణ సంస్థను ప్రారంభించి 'అహం బ్రహ్మాస్మి'ని ఫస్ట్ సినిమాగా నిర్మిస్తున్నాడు. ఇటీవలే మనోజ్ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి అభిమానులకు ట్రీట్ ఇచ్చాడు. ఈ ఫస్ట్‌లుక్‌ను మంచు మనోజ్ ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. ''కొన్నేళ్ల విరామం తరవాత వెండితెర మీద గట్టిగా గోల చేయడానికి వస్తున్నాను. ఈ క్రైమ్, కామెడీ, యాక్షన్ ఫిల్మ్‌తో మీకు కొన్ని గూస్‌బంప్స్ ఇస్తా'' అని ట్వీట్‌లో మంచు మనోజ్ గతంలో ట్వీట్ కూడా చేసాడు.

ఫస్ట్ లుక్‌లో మనోజ్ విభూది నామాలతో తిలకం పెట్టుకుని 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్‌కు అద్దం పట్టేలా హాస్యం, రౌద్రం, శాంతం ప్రదర్శిస్తున్నాడు. తాజాగా ఈరోజు మనోజ్ పుట్టినరోజు కాబట్టి విష్ చేస్తూ.. ఆయన చిత్రబృందం అహం బ్రహ్మాస్మి లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పోస్టర్ లో మనోజ్ పక్కా మాస్ లుక్ కనిపిస్తున్నాడు. ఇక సొంతంగా ఎంఎం ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని మంచు మనోజ్, నిర్మలాదేవి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి, రమేష్ తమిళమణి సంగీతం అందిస్తున్నారు. ఈ కొత్త పోస్టర్ రావడంతో ఫ్యాన్స్ అంతా హ్యాపీ. ఇక మనోజ్ బర్త్ డే కేక్ కటింగ్ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నాడు. మరి ఈ పాన్ ఇండియా మనోజ్ కెరీర్లో ఏదైనా మార్పు తెస్తుందో చూడాలి.