Begin typing your search above and press return to search.

మంచు 'అహం బ్రహ్మాస్మి' ముహూర్తం ఫిక్స్‌

By:  Tupaki Desk   |   25 Oct 2020 10:00 AM IST
మంచు అహం బ్రహ్మాస్మి ముహూర్తం ఫిక్స్‌
X
మంచు మనోజ్‌ అనేక కారణాల వల్ల దాదాపు మూడు సంవత్సరాలుగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఎట్టకేలకు ఈయన మళ్లీ సినిమాల్లో రీ ఎంట్రీకి సిద్దం అయ్యాడు. అన్ని వ్యవహారాలు చక్కబడటంతో సినిమాలపై దృష్టి కేంద్రీకరించాలని భావిస్తున్నాడు. ఇప్పటికే అహం బ్రహ్మాస్మి సినిమాను ప్రకటించిన మంచు మనోజ్‌ ఆ సినిమా షూటింగ్‌ కు రెడీ అవుతున్నాడు. తన సినీ కెరీర్‌ లోనే ఇప్పటి వరకు చేసిన సినిమాలకు ఇకపై చేయబోతున్న సినిమాలకు ఇది చాలా విభిన్నంగా ఉంటుందనే నమ్మకంతో మంచు మనోజ్‌ ఉన్నట్లుగా తెలుస్తోంది.

సినిమా ప్రకటించి నెలలు గడుస్తోంది. కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా షూటింగ్‌ ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు నవంబర్‌ 2 నుండి ఈ సినిమా షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రీకాంత్‌ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమాను మనోజ్‌ స్వయంగా నిర్మిస్తున్నాడు. హైదరాబాద్‌ శివారులోని ఒక ఫామ్‌ హౌస్‌ లో పీటర్‌ హెయిన్స్ ఆధ్వర్యంలో నవంబర్‌ 2 నుండి ఒక యాక్షన్‌ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నారు. సినిమాను ఎలాంటి ఆటంకాలు.. బ్రేక్‌ లు లేకుండా ఏకధాటిగా చిత్రీకరించి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.