Begin typing your search above and press return to search.

'ఆ బిట్లు కాదమ్మా.. డౌన్ లోడ్ బిట్లు'.. 'అన్ స్టాపబుల్' బాలయ్య..!

By:  Tupaki Desk   |   4 Nov 2022 3:30 PM GMT
ఆ బిట్లు కాదమ్మా.. డౌన్ లోడ్ బిట్లు.. అన్ స్టాపబుల్ బాలయ్య..!
X
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న 'అన్‌ స్టాపబుల్' టాక్ షో రెండో సీజన్ విజయవంతంగా కొనసాగుతోంది. ఆహా ఓటీటీ వేదికగా ఇప్పటికే స్ట్రీమింగ్ అయిన రెండు ఎపిసోడ్స్ కి విశేష స్పందన లభించింది. ఇప్పుడు లేటెస్టుగా మూడో ఎపిసోడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'అన్‌ స్టాపబుల్ 2' మొదటి ఎపిసోడ్ కి నారా చంద్రబాబు నాయుడు - లోకేష్ హాజరవ్వగా.. రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ మరియు విశ్వక్ సేన్ లు సందడి చేసారు. ఈ క్రమంలో ఇప్పుడు బాలయ్య టాక్ షోకి మరో ఇద్దరు టాలీవుడ్ యంగ్ హీరోలు శర్వానంద్ మరియు అడివి శేష్ సెలబ్రిటీ గెస్టులుగా వచ్చారు.

మనసు చెప్పిన మార్గంలో నడిచిన నవ యువకులు ఇవాళ మన అతిధులు.. నటులే కానీ అందరూ ఆశించిన పాత్రలు చెయ్యరు.. వాళ్ళు కోరుకునే పాత్రలు ఆ రోజు వరకూ ఎవరూ చేసి ఉండరు.. వాళ్ళ ఆస్తి నటనలో నిజాయితీ.. వాళ్ళ పాత్రల్లో పరిణితి.. ఆ తారలు నిజమైన యువ కథారాధకులు అంటూ శర్వానంద్ - అడివి శేష్ లకు స్వాగతం పలికారు బాలయ్య.

'నువ్ కళ్ళజోడు క్లవర్ గా పెట్టానని అనుకుంటున్నావ్.. షిపర్ అయి పెట్టావని నేను అనుకుంటున్నా' 'అందరూ ప్లవర్స్ చెవిలో పెడతారు.. నువ్ చేతిలో ఎందుకు పెట్టావమ్మా' అంటూ' ఎపిసోడ్ ప్రారంభంలోనే బాలకృష్ణ తనదైన శైలిలో యువ హీరోలను ఆదుకున్నారు. ఆద్యంతం సరదా మాటలతో ఈ చిట్ చాట్ కొనసాగిన ఈ ఎపిసోడ్ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకూ వచ్చిన ఎపిసోడ్స్ కు భిన్నంగా సాగింది.

గత ఎపిసోడ్ లో రష్మిక మందన్నా తన లేటెస్ట్ క్రష్ అని బాలయ్య చెప్పడంతో.. శర్వా తన మొబైల్ లో రష్మికకు వీడియో కాల్ చేయడం.. బాలకృష్ణ ఆమె గురించి కవిత చదువుతూ ఫ్లయింగ్ కిస్సులు పెట్టడం.. 'నా గర్ల్ ఫ్రెండ్ తో మీకు కబుర్లు ఏంటి?' అని అనడం అందరినీ నవ్వించింది. శేష్ నటించిన 'గూఢచారి' సిరీస్ 25 లేదా 26 పార్ట్ లో తనని పెట్టుకోమని బాలయ్య అడగడం అలరించింది.

బాలయ్య నటించిన 'టాప్ హీరో' సినిమాలోని 'బీడులు తాగండి బాబులు.. తాగి స్వర్గాన్ని తాకండి బాబులు' అనే పాట పాడటం వల్ల చిన్నప్పుడు తన అమ్మ చేతిలో తన్నులు తిన్నానని శేష్ వెల్లడించారు. శర్వాని ఆర్ట్ ల కంటే ఆస్తుల గురించి ఎక్కువ ప్రశ్నలు అడగాలి.. శర్వా కి యాక్టింగ్ సైడ్ బిజినెస్ అంట కదా? అని బాలకృష్ణ అడగ్గా.. ఆస్తులన్నీ తన తండ్రివి అని శర్వా సమాధానమిచ్చారు.

ఈ సందర్భంగా శర్వా - శేష్ లకు బాలయ్య గిఫ్ట్స్ అందిస్తూ.. 'ఇద్దరికీ కలిపి ఒకటి ఇచ్చాననుకో త్రీ సమ్.. ఇద్దరికీ చెరొకటి ఇచ్చాను కాబట్టి టూ సమ్.. ఏమీ ఇవ్వలేదనుకో హ్యాండ్సమ్' అంటూ నవ్వుతూనే డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలారు. 'ఎక్కడెక్కడ పెడుతున్నావో దండాలు' 'ఎప్పుడూ కవర్స్ సేఫ్ కోసమేనా?' వంటి మాటలు కూడా ఈ ఎపిసోడ్ లో బాలయ్య నోటి నుంచి వచ్చాయి.

'అదితిరావ్ హైదరీని సినిమాలో నువ్వు కొట్టేస్తే.. బయట సిద్దార్థ కొట్టేశాడా?' అని బాలయ్య ప్రశ్నించగా.. 'బయటి విషయం నాకు తెలియదు సార్' శర్వా బదులిచ్చారు. సోషల్ మీడియాలో సిద్దార్థ్ పోస్ట్ చూసి నాకు కూడా డౌట్ వచ్చింది అని శర్వా చెప్పాడు. ఈ క్రమంలో కార్వాన్ కు వెళ్తానని చెప్పి శర్వా ఇంటికి వెళ్ళిపోయిన విషయాన్ని బాలకృష్ణ రివీల్ చేయించారు.

అలానే గతంలో నిర్మాతలపై చెక్ బౌన్స్ కేసు వేయడం గురించి కూడా శర్వా వివరించారు. ప్రేమతో నమ్మకంతో సినిమా చేశాను.. వాళ్ళు అభిమానంతో ఆప్యాయతతో ఎగ్గొట్టారు.. బాధ కోపంతో అలా చేసానని చెప్పాడు. 'రన్ రాజా రన్' సినిమాలో అడివి శేష్ సీన్స్ ని ఎడిటింగ్ లో తీసేయడంపై శర్వానంద్ తో ఫన్నీ సంభాషణ జరిగింది. 'జానూ' సినిమా షూటింగ్ లో స్కై డైవింగ్ చేస్తూ పదిహేను వేల అడుగుల ఎత్తు నుంచి కింద పడిన ఇన్సిడెంట్ గురించి చెప్పి భావోద్వేగానికి గురి చేసాడు శర్వా.

సెల్ఫీ అడిగితే చెంప పగలగొట్టిన హీరో? అని బాలయ్య తన గురించి తానే ప్రస్తావించుకోవడం.. యావత్ ప్రపంచమంతా చూసింది అని శర్వా అనడం.. ప్రేమతో టచ్ చేశా అని బాలయ్య చెప్పడం నవ్వులు పూయించింది. ఈ సందర్భంగా 'ఆదిత్య 369' సినిమాకు సీక్వెల్ గా 'ఆదిత్య 999 మ్యాక్స్' కథ స్వయంగా తానే రాసుకున్నట్లు తెలిపిన బాలయ్య.. వచ్చే ఏడాది చేయనున్నట్టు వెల్లడించారు

అప్పట్లో ఒక అమ్మాయితో డేటింగ్ చేసానని.. కానీ ఇప్పుడు రిలేషన్ కట్ అయిందని.. ఇప్పుడు తాను సింగిల్ అని అడివి శేష్ వెల్లడించారు. తనకు 16 ఏళ్ళ వయసున్నప్పుడు శంకర్ దర్శకత్వం వహించిన 'బాయ్స్' సినిమాలో నటించడానికి స్క్రీన్ టెస్ట్ కి వెళ్లే అవకాశం వచ్చింది కానీ.. అప్పుడు తాను వెళ్లలేదని.. అది తలచుకుని ఇప్పటికీ రిగ్రెట్ గా ఫీల్ అవుతానని శేష్ చెప్పాడు.

గేమ్ లో భాగంగా రానా దగ్గుబాటికి శర్వానంద్ కాల్ చేయగా.. 'లైఫ్ లో నుంచి ఈ దొంగ నా కొ*కులని కట్ చెయ్' అని రానా కు బాలయ్య సలహా ఇచ్చారు. రానా టాక్ షో ప్రిన్స్ అయితే.. తాను టాక్ షో కింగ్ అని అన్నారు. 'బొబ్బిలి సింహం' సినిమా ఓపెనింగ్ రోజు అనుకోకుండా హీరోయిన్ మీనా తో లిప్ లాక్ చేసిన విషయాన్ని చెప్పి బాలయ్య నవ్వించారు. ఈ క్రమంలో 'శర్వానంద్ ఫోన్ లో ఎన్ని బిట్లు ఉన్నాయి?' అని ప్రశ్నించిన బాలయ్య.. అతని బిజినెస్ వ్యవహారాల గురించి మాట్లాడారు.

దీనికి శర్వానంద్ సరదాగా స్పందిస్తూ.. 'నాకు కూడా మీ ఆస్తుల చిట్టా మొత్తం తెలుసు. మీరు మర్చిపోయారు అనుకుంట.. మీ నాన్న గారి దగ్గర మా తాతయ్య చార్టెడ్ అకౌంటెంట్. మీ ఆస్తుల లిస్ట్ అన్ని స్కాన్ కాపీలు ఉన్నాయి మా దగ్గర. నేను కూడా మీ ఆస్తుల లిస్ట్ బయటపెడతా. ఎన్ని బిట్లు ఉన్నాయో చెప్పమంటారా సార్' అని అన్నాడు. బాలయ్య స్పందిస్తూ 'ఆ బిట్లు కాదమ్మా.. డౌన్ లోడ్ బిట్లు' అని నవ్వుతూ అన్నారు. నాది ఫ్యామిలీ షో.. నీలాంటి వారిని పిలవడమే తప్పు అని సరదాగా వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.