Begin typing your search above and press return to search.

`ఆహా` అనిపించేలా స‌రికొత్త ఫాంట‌సీ థ్రిల్ల‌ర్..?

By:  Tupaki Desk   |   14 Dec 2020 10:24 AM IST
`ఆహా` అనిపించేలా స‌రికొత్త ఫాంట‌సీ థ్రిల్ల‌ర్..?
X
బిఫోర్ క‌రోనా.. ఆఫ్ట‌ర్ క‌రోనా! సినిమా వీక్ష‌ణ ప‌ద్ధ‌తి మారిపోయింది. థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమాలు చూసినా కానీ ఓటీటీ సౌల‌భ్యం ఏమిటో ఇప్ప‌టికే జ‌నాల‌కు అర్థ‌మైంది. అందువ‌ల్ల ఈ వేదిక‌కు ఆద‌ర‌ణ క‌రువ‌వ్వ‌దు అన్న విశ్లేష‌ణ సాగుతోంది. స‌రిగ్గా ఇదే ఆలోచ‌న‌తో చాలామంది సొంత ఓటీటీల నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నారు.

టాలీవుడ్ లో తొలిగా అల్లు బాస్ అర‌వింద్ డేర్ స్టెప్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆయ‌న‌ ఆహా-తెలుగు ప్రారంభించి సంచ‌ల‌నం సృష్టించారు. తెలుగు డిజిటల్ ప్లాట్ ‌ఫామ్ `ఆహా` నెమ్మదిగా జ‌నంపై ప్రభావం చూపుతోంది. ఇటీవలి కొన్ని ఒరిజిన‌ల్ షోస్ సినిమాల‌కు మంచి స్పందన లభిస్తోంది. వీక్షకుల సంఖ్య ఇటీవలి కాలంలో అంత‌కంత‌కు పెరుగుతోంది.

కంటెంట్ ప‌రంగా వైవిధ్యం చూపించ‌గ‌లిగితే ఇంత‌కుమించి స‌క్సెస్ సాధ్య‌మ‌ని భావించిన ఆహా టీమ్ మునుముందు మ‌రిన్ని రంజైన కార్య‌క్ర‌మాల్ని ఒరిజిన‌ల్ సినిమాల్ని ప్లాన్ చేస్తోంద‌ట‌. ఆహా కోసం ప్రత్యేకంగా `ఫాంటసీ థ్రిల్లర్` ల‌ను నిర్మించే ప్లాన్ లో ఉందిట‌.

నెట్ ఫ్లిక్స్ `లీలా` ఫేం పవన్ కుమార్ ను లాక్ చేసి స్క్రిప్టును పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు‌. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ ఫాంటసీ థ్రిల్లర్ ‌లో అమలా పాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ ఫాంటసీ థ్రిల్లర్ వివరాలను ఆహా త్వరలో ప్రకటించనుంది. ఇది వచ్చే ఏడాది నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. నెట్ ఫ్లిక్స్ కోసం `లీలా` పేరుతో పెద్ద బడ్జెట్ వెబ్ సిరీస్ ‌కు పవన్ దర్శకత్వం వహించారు. దీపా మెహతా- శంకర్ రామన్ లతో కలిసి వెబ్ సిరీస్ దర్శకత్వం వహించారు. ప్ర‌స్తుతం ఆహా పేరుతో మంచి ఆఫ‌ర్ ద‌క్కింది.