Begin typing your search above and press return to search.

అల్లు వారి ‘ఆహా’ ఇకపై అందరికి!

By:  Tupaki Desk   |   6 July 2020 9:00 PM IST
అల్లు వారి ‘ఆహా’ ఇకపై అందరికి!
X
అల్లు అరవింద్‌ ప్రారంభించిన ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ లో మొదట ఎక్కువగా అడల్ట్‌ కంటెంట్‌ ను పెట్టారు. వెబ్‌ సిరీస్‌ లు మరీ వల్గర్‌ గా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. దాంతో ఆహా పై ఇది పెద్దలకు మాత్రమే అనే ముద్ర పడిపోయింది. ఆ కారణంగా బిజినెస్‌ ఆశించిన స్థాయిలో జరగడం లేదనే వాదన వినిపిస్తుంది. ఆ కారణంగానే అల్లు వారు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇకపై ఆహాలో బోల్డ్‌ కంటెంట్‌ కు చోటు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. వెబ్‌ సిరీస్‌ ల్లో కూడా కంటెంట్‌ అశ్లీలంగా ఉంటే దాన్ని రిజెక్ట్‌ చేయాలని భావిస్తున్నారు.

ఆహా టీం ప్రస్తుతం పలు వెబ్‌ సిరీస్‌ లను రూపొందించే పనిలో ఉంది. కథలు వినడంతో పాటు వెబ్‌ మూవీస్‌ ను కూడా నిర్మిస్తున్నారు. డిజిటల్‌ మూవీ అనగానే చాలా మంది అడల్ట్‌ కంటెంట్‌ స్క్రిప్ట్‌ లు తీసుకు వస్తున్నారట. వాటన్నింటిని కూడా ఆహా క్రియేటివ్‌ టీం రిజెక్ట్‌ చేస్తుందట. ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్‌ మెచ్చే వెబ్‌ సిరీస్‌ లు మరియు ఎంటర్‌ టైన్‌ మెంట్‌ తో కూడిన స్క్రిప్ట్‌ లను మాత్రమే పరిశీలిస్తున్నారట.

ఆహా ఇకపై చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు అందరికి అనే పబ్లిసిటీ కూడా చేయబోతున్నారట. మొత్తానికి అల్లు వారు ఇప్పటికి అయినా మేల్కొనడం మంచిది అయ్యిందని లేదంటే ఆహా అనేది ఒక బూతు కంటెంట్‌ ప్లాట్‌ ఫామ్‌ గా మరింతగా పేరు పడిపోయేది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags: