Begin typing your search above and press return to search.

ఆహా అఫిషియల్‌... బాలయ్య అన్‌ స్టాపబుల్‌ 2

By:  Tupaki Desk   |   20 Jun 2022 3:13 PM GMT
ఆహా అఫిషియల్‌... బాలయ్య అన్‌ స్టాపబుల్‌ 2
X
నందమూరి బాలకృష్ణ లో ఉన్న కొత్త యాంగిల్ ను తెలుగు ఓటీటీ ఆహా తెలుగు ప్రేక్షకులకు చూపించింది. ఆహా లో స్ట్రీమింగ్ అయిన ఎన్‌ బీ కే అన్ స్టాపబుల్‌ షో మంచి సక్సెస్ ను దక్కించుకుంది.

ఇప్పటి వరకు తెలుగు లో వచ్చిన ఎన్నో టాక్ షో లకు ఈ టాక్‌ షో చాలా విభిన్నమైనది అంటూ ఆహా టీమ్ ప్రకటించినా కూడా మొదట లైట్ తీసుకున్నా బాలయ్య మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా నిజంగానే అన్‌ స్టాపబుల్‌ అన్నారు.

మొదటి ఎపిసోడ్‌ మోహన్ బాబుతో మొదలు అవ్వగా చివరి ఎపిసోడ్‌ మహేష్‌ బాబుతో ఎండ్‌ అయ్యింది. అన్‌ స్టాపబుల్‌ అప్పుడే పూర్తి అవ్వడంతో అభిమానులు ఒకింత అసహనం మరియు ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అన్‌ స్టాపబుల్‌ సీజన్ 2 గురించిన వార్తలు సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో వస్తున్నాయి.

ఈ సమయంలో ఆహా నుండి అఫిషియల్ గా అన్‌ స్టాపబుల్‌ సీజన్ 2 రాబోతుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇన్ని రోజులు వారు అంటున్నారు.. వీళ్లు చెబుతున్నారు అనే ప్రచారం జరిగింది. మొదటి సారి ఆహా నుండి అధికారిక ప్రకటన రావడం తో బాలయ్య ఫ్యాన్స్ తో పాటు ఆహా ఓటీటీ ప్రేక్షకులు మరియు ఇతర ఇండస్ట్రీ వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఉన్నారు.

బాలయ్య అన్ స్టాపబుల్‌ 2 ను ఆగస్టు లో షురూ చేసే అవకాశాలు ఉన్నాయంటూ సమాచారం అందుతోంది. అన్ స్టాపబల్‌  2 షో లో చిరంజీవితో పాటు ఎన్టీఆర్ ఇంకా కచ్చితంగా స్టార్స్ పెద్ద స్టార్స్ వస్తారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతానికి అతి త్వరలో అంటూ ప్రకటన వచ్చింది కాని.. జూలై నెల రెండవ లేదా మూడవ వారం కు స్ట్రీమింగ్ తేదీపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే అఖండ సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ వెంటనే అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్య సినిమా ఉండబోతుంది. బాలయ్య వరుస సినిమాలతో రావడంతో పాటు అన్ స్టాపబుల్‌ తో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.