Begin typing your search above and press return to search.

'ఆహా' కోసం సంతోష్ శోభన్ ‘ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సిరీస్..!

By:  Tupaki Desk   |   27 Aug 2021 11:30 PM GMT
ఆహా కోసం సంతోష్ శోభన్ ‘ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ’ వెబ్ సిరీస్..!
X
తెలుగు ఓటీటీ 'ఆహా వీడియో' ఇతర డిజిటల్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫారమ్స్ కు పోటీగా ఒరిజినల్ కంటెంట్ అందించడానికి ట్రై చేస్తోంది. బ్లాక్ బస్టర్ సినిమాలతో పాటుగా టాక్ షోలు - వెబ్ సిరీస్ లను వీక్షకులకు అందుబాటులో ఉంచుతోంది. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ తో కలిసి 'ది బేక‌ర్ అండ్ ది బ్యూటీ' అనే ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌ తో వస్తోంది. 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ ఈ రొమాంటిక్ డ్రామాతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నాడు. టీనా శిల్ప‌రాజ్ మరో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబ‌ర్ 10న ఈ సిరీస్ ని స్ట్రీమింగ్ పెడుతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఈ నేపథ్యంలో తాజాగా 'ది బేక‌ర్ & ది బ్యూటీ' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ ని స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ - అన్న‌పూర్ణ స్టూడియోస్ సీఈఓ సుప్రియా యార్ల‌గ‌డ్డ క‌లిసి ఆవిష్క‌రించారు. ఇందులో టీనా ఇమేజ్ రోడ్ సైడ్ హోర్డింగ్‌ లో ఉండగా.. సంతోష్ శోభన్ దాని పక్కనే నిలబడి ఉన్నాడు. ఇద్దరు భిన్న మనస్కుల మధ్య జరిగే ప్రేమ, రొమాన్స్ - ఎమోషన్ వంటి అంశాలతో ఈ సిరీస్ రూపొందించారు. మిడిల్ క్లాస్ యువ‌కుడు విజ‌య్‌ గా సంతోష్.. ఫిల్మ్ స్టార్ ఐరా వాసిరెడ్డి గా టీనా కనిపించనున్నారు.

'అమరం అఖిలం ప్రేమ' ఫేమ్ జొనాథ‌న్ ఎడ్వ‌ర్డ్స్ ''ది బేక‌ర్ & ది బ్యూటీ'' వెబ్ సిరీస్ కు ద‌ర్శ‌క‌త్వం వహించారు. నిర్మాత సుప్రియా యార్ల‌గ‌డ్డ‌ దీనికి స్క్రిప్ట్ సూప‌ర్‌ వైజ‌ర్‌ గా.. మ‌హేశ్వ‌ర్ రెడ్డి గోజుల‌ షో ర‌న్న‌ర్‌ గా వ్యవహరించారు. ప్ర‌శాంత్ ఆర్‌.విహారి సంగీతం సమకూర్చారు. సురేశ్ ర‌గుతు సినిమాటోగ్ర‌ఫీ అందించగా.. నాగేశ్వ‌ర్ రెడ్డి ఎడిటింగ్ వర్క్ చేశారు. పది ఎపిసోడ్స్ గా రానున్న ఈ సిరీస్ లో సంతోష్ - టీనా లతో పాటుగా విష్ణు ప్రియ‌ - సాయి శ్వేత‌ - సంగీత్ శోభ‌న్‌ - శ్రీకాంత్ అయ్యంగార్‌ - ఝాన్సీ ల‌క్ష్మి - వెంక‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అన్నపూర్ణ స్టూడియోస్ - ఆహా కలిసి చేస్తున్న ఈ సిరీస్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.