Begin typing your search above and press return to search.
రామ్ చరణ్ హాలీవుడ్ సినిమా… త్వరలో పక్కా!
By: Tupaki Desk | 9 March 2023 12:30 AM ISTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ ఆశీర్వదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కు హాలీవుడ్ దర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. కళ్ళల్లో అద్భుతమైన ఎమోషన్స్ ని పలికిస్తూ కథలో భావోద్వేగాన్ని అద్భుతంగా రామ్ చరణ్ నడిపించాడని జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించారు. ఇది ఇలా ఉంటే గత నెలలో రామ్ చరణ్ అమెరికాలో హాలీవుడ్ ఫిలిం క్రిటిక్ అసోసియేషన్ అవార్డులను కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
స్పాట్ లైట్ అవార్డ్స్ ను రామ్ చరణ్ సొంతం చేసుకోవడంతో హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ లో దృష్టి చెర్రీపై పడిందని చెప్పాలి. అలాగే గుడ్ మార్నింగ్ అమెరికా టీవీ షోలో పార్టిసిపేట్ చేయడం ద్వారా కూడా రామ్ చరణ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ నేపథ్యంలో హాలీవుడ్ సినిమాలలో కూడా రామ్ చరణ్ కి ఆఫర్స్ వస్తున్నాయనే మాట సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తుంది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో హాలీవుడ్ సినిమాల్లో నటించే విషయంపై రామ్ చరణ్ ని అడగగా ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిపోయిన తర్వాత కచ్చితంగా ప్రయత్నం చేస్తానని చెప్పారు.
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ రామ్ చరణ్ తో సినిమా కోసం అగ్రిమెంట్ చేసుకున్నట్లుగా టాక్. అయితే శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న సినిమా కంప్లీట్ అయిన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్ కొత్త సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తారు. ఆ సమయంలో ప్రాజెక్టు గురించి అఫీషియల్ గా బయటకు వచ్చే అవకాశం ఉంది అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.
నిజంగా రామ్ చరణ్ హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుంటే మాత్రం అది కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది అని చెప్పొచ్చు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటివరకు ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం రామ్ చరణ్ కి లభించే అవకాశం ఉంటుంది. ఇండియన్ యాక్టర్స్ ఇప్పటికే హాలీవుడ్ లో నటిస్తున్న కూడా లీడ్ రోల్ చేసే అవకాశం ఎవరికీ రాలేదు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ కి ఆరుదైన అవకాశం ఉందని టాక్. మార్వెల్ సిరీస్ లో వచ్చే సూపర్ హీరో తరహా కథతో లేదంటే జేమ్స్ బాండ్ తరహా కాన్సెప్ట్ హాలీవుడ్ లో రామ్ చరణ్ మూవీ చేసే ఛాన్స్ ఉందని భోగట్ట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.