Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ కు అజ్ఞాతవాసి ఎఫెక్ట్?

By:  Tupaki Desk   |   11 Jan 2018 10:11 AM GMT
ఎన్టీఆర్ కు అజ్ఞాతవాసి ఎఫెక్ట్?
X
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన అజ్ఞాతవాసి సినిమా ఫైనల్ గా మిక్సిడ్ టాక్ తో ప్రస్తుతం అలా నడిచిపోతోంది. మొదటి షోకే సినిమా కొంచెం నెగిటివ్ టాక్ ను అందుకున్న సంగతి తెలిసిందే. కానీ ఫెస్టివల్ సీజన్ కావడంతో అదృష్టం కొద్దీ ఏదైనా మ్యాజిక్ జరుగుతుందేమో అని అందరు ఎదురుచూస్తున్నారు. ఎక్కువగా అందరు త్రివిక్రమ్ డైరెక్షన్ పైనే నమ్మకం పెట్టుకున్నారు. ఆయన స్టైల్ లో ఉండే ఎంటర్టైన్మెంట్ అలాగే డైలాగ్స్ ఉంటాయని అనుకున్నారు.

కానీ ఏ విధంగా సినిమా పూర్తిగా మంచి టాక్ ను అందుకోలేదు. అయితే ఈ సినిమా రిజల్ట్ ని పక్కనపెడితే.. ఎన్టీఆర్ అభిమానులు కొంచెం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే తారక్ నెక్స్ట్ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చేయనున్నాడు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ అవ్వనుంది. అయితే ప్రస్తుతం అజ్ఞాతవాసి రిజల్ట్ ఎఫెక్ట్ ఆ కథపైన ఏమైనా పడుతుందా అని ఓ వర్గం ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది.

అంతే కాకూండా అజ్ఞాతవాసి కథ కాపీ అన్నట్లు తారక్ ప్రాజెక్టు పై కూడా అలాంటి మరకలు పడతాయా అని టాక్ వినిపిస్తోంది. అజ్ఞాతవాసి ఆయిపోగానే త్రివిక్రమ్ తారక్ ప్రాజెక్టు ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. కానీ మిక్సిడ్ టాక్ ఆయనను తికమకకు గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. పైగా అజ్ఞాతవాసికి లాభాలు అందకుంటే నిర్మాత ఆ సినిమాకు బడ్జెట్ ని ఎలా అడ్జస్ట్ చేయగలడు అనే మరొక రూమర్ బాగా స్ప్రెడ్ అవుతోంది. మరి ఇలాంటి అనుమానాల మధ్య త్రివిక్రమ్ హిట్టు కొడితేనే మళ్లీ రికవర్ అవుతాడు. లేకుంటే...?