Begin typing your search above and press return to search.
అక్కడ పడి ఇక్కడ పడకపోతే తేడా రాదా?
By: Tupaki Desk | 9 Jan 2018 7:34 PM ISTఅజ్ఞాతవాసి మూవీకి తెలంగాణలో ప్రీమియర్స్.. ఈ విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. బెనిఫిట్ షోస్.. స్పెషల్ షోస్.. ప్రీమియర్స్.. పేరు ఏదైనా సరే హైద్రాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడా మిడ్ నైట్ షోస్ పడడం లేదు. ఇది నిజంగా నైజాం ఆడియన్స్ కు నిరుత్సాహం కలిగించే విషయమే.
అయితే.. ఇక్కడే ఒక పాయింట్ ఉంది. అజ్ఞాతవాసిని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం స్పెషల్ షోస్ వేసేస్తున్నారు. రోజుకు ఏడు షోస్ చొప్పున.. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ప్రదర్శించుకోవడానికి అనుమతి ఇచ్చేసింది అక్కడి ప్రభుత్వం. కానీ తెలంగాణలో మాత్రం ఉదయం 8 గంటల తర్వాత మాత్రమే ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి. అంటే.. ఏపీలో సినిమా గురించి అర్ధరాత్రే టాక్ బయల్దేరిపోతుందన్న మాట. నైజాంలో తొలి ఆట పడేందుకు ముందే.. ఏపీలో రెండు షోస్ కంప్లీట్ అయిపోతాయి. ఆ లెక్కన మూవీ గురించి ఫుల్ టాక్ బయటకు వచ్చేస్తుంది.
ఎక్కడా షోస్ పడకపోతే లెక్క వేరు. కానీ ఒక ప్రాంతంలో టెలికాస్ట్ అయ్యి.. మరో ప్రాంతంలో నిలిచిపోవడం మాత్రం నిరాశకలిగించే విషయమే. టాక్ పాజిటివ్ గా ఉంటే పెద్దగా డిఫరెన్స్ కనిపించకపోవచ్చు కానీ.. టాక్ తేడా వస్తే మాత్రం అది నైజాంలో కలెక్షన్స్ పై విపరీతంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా మొదటి రోజుపై ఎఫెక్ట్ లేకపోయినా.. రెండో రోజుకు మాత్రం దెబ్బ పడొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.
అయితే.. ప్రస్తుతం ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ గా మారిపోయిందని.. ఎక్కడో ఏదో దేశంలో షో పడినా.. రివ్యూలు కూడా వచ్చేస్తున్న సంగతి గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో భారీ సంఖ్యలో ముందు రోజే ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్న సంగతి గుర్తు చేస్తూ.. ఏపీలో పడినంత మాత్రానే.. టాక్ తెలిసిపోతుందని అనుకోవడం కరెక్ట్ కాదనే మాటలు వినిపిస్తున్నాయి.