Begin typing your search above and press return to search.

మల్లూ గడ్డపై అజ్ఞాతవాసి

By:  Tupaki Desk   |   30 Nov 2017 8:20 PM IST
మల్లూ గడ్డపై అజ్ఞాతవాసి
X
టాలీవుడ్ లో ప్రస్తుతం అందరు ఎదురుచూస్తోన్న చిత్రం ఏదైనా ఉందా అని అంటే అది ఒక్క పవన్ కళ్యాణ్ చిత్రమనే చెప్పాలి. అభిమానుల కోరిక మేరకే అజ్ఞాతవాసి అని నామకరణం చేసుకొని రెడీ అవుతోన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దాహం ఎంత తీర్చుకుంటుందో అని ఎనలిస్ట్ లు లెక్కలు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే మాములుగా ఉంటుందా మరి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లతో పాటు ఇతర బాషాల వారు కూడా పవర్ స్టార్ 25వ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ కి నార్త్ సైడ్ కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. అప్పట్లో సినిమాలో ఒక హిందీ సాంగ్ వచ్చేట్టు తప్పకుండా సెట్ చేయించుకునేవాడు. ఇకపోతే కేరళలో కూడా పవర్ స్టార్ సినిమాలకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే మలయాళంలో అజ్ఞాతవాసి డైరెక్ట్ గా తెలుగులో మరియు వీలైతే మళయాళ డబ్బింగ్ వెర్షన్ కూడా రిలీజ్ కానుందట. సాధారణంగా పవన్ యాక్షన్ సీన్స్ ను మలయాళీ సినీ ప్రేమికులు భాషతో సంబంధం లేకుండా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక అజ్ఞాతవాసిలో అలాంటి ఎపిసోడ్స్ కూడా చాలానే ఉన్నాయట.

ఇకపోతే కేరళ అభిమానులు అజ్ఞాతవాసిని ఎక్కువగా ఇష్టపడటానికి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే.. అనిరుద్ కొలవెరి సాంగ్ అక్కడి వారికి తెగ నచ్చేసింది. దీంతో సంగీత దర్శకుడు అనిరుద్ సినిమాలను వారు చాలా ఇష్టపడతారు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మలయాళీ భామలు కీర్తి సురేష్ - అను ఎమ్మానుయేల్ ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఉండడం వారికి బాగా నచ్చింది. దీంతో నిర్మాతలు మల్లూ గెడ్డపై భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2018 జనవరి 10న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే.