Begin typing your search above and press return to search.

అజ్ఞాతవాసికి లీకుల బాధ తప్పట్లేదు

By:  Tupaki Desk   |   3 Nov 2017 11:19 PM IST
అజ్ఞాతవాసికి లీకుల బాధ తప్పట్లేదు
X
పవన్ కళ్యాణ్ 25వ సినిమా 'అజ్ఞాతవాసి' పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంకా టైటిల్ కూడా అధికారికంగా తెలుపని ఈ చిత్రం కోసం ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్నారు. అజ్ఞాతవాసి అని టాక్ వస్తున్నా ఇంకా దర్శకుడు ఆ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఫస్ట్ లుక్ కోసం అభిమానుల ఆశగా ఎదురు చూస్తున్నారు.

అయితే సినిమా ఫస్ట్ లుక్ సంగతి ఏమో గాని ఫొటోస్ మాత్రం బాగానే లీక్ అవుతున్నాయి. కొన్ని నెలల క్రితం షూటింగ్ లో పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్న కొన్ని ఫొటోస్ లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విదేశాల్లో చేస్తున్న కొన్ని సీన్స్ తాలూకు ఫొటోస్ కూడా లీక్ అవ్వడం అందరికి ఆశ్చర్యన్నీ కలిగిస్తోంది. షూటింగ్ స్పాట్ లో అను ఎమ్మెన్యుయేల్ - పవన్ కళ్యాణ్ ఫొటోస్ ని ఎవరో చాటుగా తీసినట్లు తెలుస్తోంది. సాధారణంగా త్రివిక్రమ్ ఫొటోస్ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా ఉంటాడు.

కానీ ఇప్పుడు ఇలా ఎవరికీ తెలియకుండా లీక్ అవ్వడం చూస్తుంటే చిత్ర యూనిట్ లోనే ఎవరో ఒకరు ఈ పని చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఫొటోస్ లో అను ఎమ్మెన్యుయేల్ కాస్త గ్లామర్ డోస్ ని బాగా పెంచేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎప్పటిలానే సింపుల్ సూపర్బ్ అనేలా ఉన్నాడు. ప్రస్తుతం యూరోప్ లో సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి ఇదే చివరి షెడ్యూల్. అక్కడ త్వరలోనే షూటింగ్ ముగించేసుకుని వీలైనంత త్వరగా డబ్బింగ్ కార్యక్రమాలను కుడా పూర్తి చేసుకోనుంది ఈ చిత్రం.