Begin typing your search above and press return to search.

ఆ విష‌యంలోనే దూకుడు.. కెరీర్ మాత్రం జీరో!

By:  Tupaki Desk   |   6 Aug 2020 3:30 AM GMT
ఆ విష‌యంలోనే దూకుడు.. కెరీర్ మాత్రం జీరో!
X
అందాల క‌థానాయిక ర‌కుల్ ప్రీత్ సింగ్ జోష్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. టాలీవుడ్ లో కేవ‌లం ఐదారేళ్ల‌లోనే స్టార్ హీరోల స‌ర‌సన న‌టించి స్టార్ హీరోయిన్ గా పాపుల‌రైంది. మ‌హేష్‌- చ‌ర‌ణ్- ఎన్టీఆర్ - బ‌న్ని లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించేసిన ఈ భామ కెరీర్ ఉన్న‌ట్టుండి ఒక్క‌సారిగా మ‌స‌క‌బారింది.

కింగ్ నాగార్జున స‌ర‌స‌న `మన్మధుడు 2`లో నటించిన‌ రకుల్ అటుపై తెలుగులో అవ‌కాశాల్లేక ఇరుగు పొరుగు ప‌రిశ్ర‌మ‌ల‌పై దృష్టి సారించింది. ఇక ముంబై ప‌రిశ్ర‌మ‌లో ప‌ట్టుకోసం ఈ అమ్మ‌డు చేయ‌ని ప్ర‌య‌త్న‌మే లేదు. అందుకోసం అక్క‌డ యువ క‌థానాయిక‌ల అండ‌దండ‌ల‌తో సీరియ‌స్ గానే ప్ర‌యత్నాల్లో ఉంది. కానీ ఏదీ వ‌ర్క‌వుట్ అవ్వ‌డం లేద‌ని స‌మాచారం. ఇక ర‌కుల్ నిరంత‌రం సోష‌ల్ మీడియాల్లో జ‌రంత స్పీడ్ గానే ఉంటోంది.

తాజాగా ర‌కుల్ ని ఇన్ స్టా మాధ్య‌మంలో ఫాలో అయ్యేవారి సంఖ్య కోటిన్న‌ర (15 మిలియ‌న్లు)కు చేరుకోవ‌డం ఓ రికార్డ్ అని చెబుతున్నారు. ఫ్యాన్స్ కి కృత‌జ్ఞ‌త‌లు చెబుతూ తాజాగా ర‌కుల్ ఓ వీడియోని రిలీజ్ చేసింది. ప్ర‌స్తుతం ఇది వైర‌ల్ గా మారింది. టాలీవుడ్ లో 15 మిలియన్ల ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ఉన్న ఏకైక తార‌గా ర‌కుల్ అరుదైన రికార్డును అందుకుంది. ర‌కుల్ త‌ర్వాత కాజల్ అగర్వాల్ కి 14.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

అయితే కాజ‌ల్ ని ఇన్ స్టా రేసులో వెన‌క్కి నెట్టేసినా కెరీర్ ప‌రంగా మాత్రం ఆ స్థాయిని అందుకోవ‌డం అసాధ్య‌మేన‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం ర‌కుల్ భార‌తీయుడు 2లో సెకండ్ లీడ్ లో న‌టిస్తుండ‌గా కాజ‌ల్ మెయిన్ లీడ్ గా న‌టిస్తోంది. ర‌కుల్ హిందీలోనూ ఓ చిత్రానికి సంత‌కం చేసేందుకు రెడీ అవుతోంద‌ని స‌మాచారం.