Begin typing your search above and press return to search.

అఖిల్ స్టన్నింగ్ పోస్టర్ తో 'ఏజెంట్' షూటింగ్ అప్డేట్..!!

By:  Tupaki Desk   |   12 July 2021 6:55 AM GMT
అఖిల్ స్టన్నింగ్ పోస్టర్ తో ఏజెంట్ షూటింగ్ అప్డేట్..!!
X
అక్కినేని ఫ్యామిలీ మల్టీస్టారర్ 'మనం' లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన యూత్ కింగ్ అఖిల్.. హీరోగా సాలిడ్ హిట్ కొట్టాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం 'బొమ్మరిల్లు' భాస్కర్‌ దర్శకత్వంలో ''మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌'' అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌ పై రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ''ఏజెంట్'' అనే స్పై థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు. అఖిల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాని అనౌన్స్ చేసిన మేకర్స్.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ తోనే సినిమాపై అంచనాలు పెంచేశారు. ఈ నేపథ్యంలో అఖిల్ కు సంబంధించిన ఓ స్టన్నింగ్ పోస్టర్ తో సినిమా షూటింగ్ అప్డేట్ ఇచ్చారు.

''ఏజెంట్'' సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు సోమవారం హైదరాబాద్ లో ప్రారంభమైందని చిత్ర యూనిట్ ప్రకటించారు. ''ది కిల్లర్ అఖిల్ అక్కినేని & స్టన్నర్ సురేందర్ రెడ్డి సూపర్ ఛార్జ్ తో యాక్షన్ మొదలుపెట్టారు. మెటిక్యులస్ ప్లానింగ్ & ఇంటెన్స్ ట్రైనింగ్ తరువాత మా #AGENT షూటింగ్ ఈరోజు ప్రారంభమవుతుంది'' అని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇందులో అఖిల్ 8 ప్యాక్ బాడీని చూపించడంతో పాటుగా సినిమా నేపథ్యాన్ని గుర్తు చేస్తూ గన్ ని చూపిస్తున్నారు. నిన్న రిలీజ్ చేసిన వైల్డ్ పోస్టర్ కంటే ఇది ఇంకా బాగుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

'ఇది ఆరంభం మాత్రమే.. మీకు ముందు ముందు ఉంది పండగ' అంటూ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఆదివారం అఖిల్ కు సంబంధించిన ఓ వైల్డ్ పోస్టర్ ను వదిలిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఇన్నాళ్లూ లవర్‌ బాయ్ లుక్ లో కనిపించిన అఖిల్.. 'ఏజెంట్' సినిమాలో మాస్ లుక్ ట్రై చేస్తున్నాడని తెలుస్తుంది. కండలు తిరిగిన దేహాన్ని రెడీ చేయడానికి యువ హీరో చాలానే కష్టపడ్డాడని ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్ చూస్తే స్పష్టంగా అర్థం అవుతుంది. మరి 'ఏజెంట్' సినిమాతో అక్కినేని వారసుడు అనుకున్న సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి.

'ఏజెంట్' చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌ గా నటిస్తోంది. దీనికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. సక్సెస్ ఫుల్ రైటర్ - డైరెక్టర్ కాంబోగా గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ - సురేందర్ రెడ్డి చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా కోసం కలుస్తున్నారు. ఈ చిత్రానికి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. రాగూల్ హెరియన్ ధారుమాన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు సరెండర్2సినిమా బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర - సురేందర్ రెడ్డి దీనికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే 'ఏజెంట్' మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందని అఖిల్ అక్కినేని తాజాగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ''365 రోజుల క్రితం మానసికంగా మరియు శారీరకంగా నన్ను మార్చమని డైరెక్టర్ సురేందర్ రెడ్డి సవాలు చేశారు. సర్.. మీరు నాలో రగిల్చిన ఈ ఫైర్ మన సినిమా ద్వారా బయటకు వస్తుందని నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను'' అని అఖిల్ ట్వీట్ లో పేర్కొన్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ 24వ తేదీన ''ఏజెంట్'' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.