Begin typing your search above and press return to search.
హిట్ తో పాటు ఏజెంట్ కూడా బాలీవుడ్ కు..!
By: Tupaki Desk | 20 July 2020 2:20 PM ISTఈమద్య కాలంలో తెలుగు సినిమాలు ఉత్తరాదికి క్యూ కడుతున్నాయి. అర్జున్ రెడ్డి అక్కడ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో చిన్న చిత్రాలను కూడా ఉత్తరాదిన రీమేక్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది అంటే అదో చాలా పెద్ద విషయంగా భావించే వారు. కాని ఇప్పుడు మాత్రం తెలుగు సినిమాలు బాలీవుడ్ లో వరుసగా రీమేక్ అవుతున్నాయి. ప్రస్తుతం జెర్సీ.. ఎఫ్ 2 చిత్రాలతో పాటు పలు తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ కు రెడీ అవుతున్నాయి.
ఇటీవలే చిన్న చిత్రమైన ‘హిట్’ ను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లుగా నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటించాడు. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యిందన్నాడు. ఈ సమయంలోనే మరో చిన్న చిత్రం హిందీ రీమేక్ గురించిన చర్చ తెగ జరుగుతోంది. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయను హిందీలో రీమేక్ చేయబోతున్నారట.
విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే నిర్మాత మరియు దర్శకుడు స్వయంగా ఈ చిత్రంను హిందీకి తీసుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారట. ఇప్పటి వరకు అధికారికంగా అయితే ప్రకటన రాలేదు. కాని బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థతో ఈ రీమేక్ విషయమై నిర్మాత రాహుల్ యాదవ్ మరియు దర్శకుడు స్వరూప్ చర్చలు జరుపుతున్నాడట. త్వరలోనే ఈ విషయమై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు.