Begin typing your search above and press return to search.

స‌గానికి స‌గం వ‌య‌సు తేడా ఏంటో

By:  Tupaki Desk   |   17 Sep 2015 7:51 AM GMT
స‌గానికి స‌గం వ‌య‌సు తేడా ఏంటో
X
టాలీవుడ్‌, బాలీవుడ్‌ లో స్టార్ హీరోల స‌ర‌స‌న కుర్ర నాయిక‌లు న‌టించాలంటే వ‌య‌సు తేడా స్ప‌ష్టంగా క‌నిపించేస్తోంది. బాల‌య్య‌ - వెంకీ - నాగార్జున‌ - ప‌వ‌న్ లాంటి హీరోల‌కు జంట‌గా పాతిక ప్రాయం నాయిక‌లు క‌నిపిస్తే ఆ తేడా స్ప‌ష్టంగా తెలిసిపోతోంది. ఇప్పుడు బాలీవుడ్‌ లోనూ అదే బాప‌తులో స‌గానికి స‌గం వ‌య‌సు తేడాతో జంట‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. డీటెయిల్స్‌ లోకి వెళితే..

షారూక్ ఖాన్ - ఆలియా భ‌ట్ జంట‌గా గౌరీ షిండే ద‌ర్శ‌క‌త్వంల ఓ సినిమా. 50కి 22కి లింకు పెట్టిన‌ట్టే. వ‌య‌సులో తేడా 28 సంవ‌త్స‌రాలు. ఈ ఇద్ద‌రూ జోడీగా తెర‌పై ఎలా క‌నిపిస్తారో చూడాలి. అక్ష‌య్ కుమార్ - ఎమీజాక్స‌న్ .. జంట‌గా సింగ్ ఈజ్ బ్లింగ్ తెర‌కెక్కుతోంది. 47కి 23కి జ‌త కుదిరింది. తేడా 24 సంవ‌త్స‌రాలు. అజ‌య్ దేవ‌గ‌న్ - స‌యేషా సైగ‌ల్ ఈ ఇద్ద‌రూ జోడీగా క‌నిపించ‌బోతున్నారు. అజ‌య్ వ‌య‌సు 46, స‌యేషా వ‌య‌సు 18 . ఇద్ద‌రికీ మ‌ధ్య వ‌య‌సు తేడా 28 సంవ‌త్స‌రాలు. ఈ జంట ఎలా క‌నిపిస్తుందో? ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రంలో స‌ల్మాన్‌ ఖాన్ స‌ర‌స‌న సోన‌మ్ క‌పూర్ న‌టిస్తోంది. స‌ల్మాన్ వ‌య‌సు 50ని క్రాస్ చేస్తోంది. సోన‌మ్ ఏజ్ 30. ఇద్ద‌రి మ‌ధ్యా 20 ఏళ్ల గ్యాప్ క‌నిపిస్తోంది. ఇంత తేడా ఉంది కాబ‌ట్టి తెర‌పై రొమాన్స్ పండుతుందా? వెయిట్ అండ్ సీ.