Begin typing your search above and press return to search.

సిగరెట్ నోటితో హీరోయిన్స్ చెప్పేదంటంటే

By:  Tupaki Desk   |   24 Aug 2017 5:21 PM GMT
సిగరెట్ నోటితో హీరోయిన్స్ చెప్పేదంటంటే
X
సిగరెట్ తాగడం.. ప్రతీ సినిమా ప్రారంభానికి ముందు సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ మెసేజ్ అయితే ఉంటుంది కానీ.. సినిమాలో మాత్రం పలు క్యారెక్టర్లు తెగ పొగ పీల్చేస్తూ ఉంటాయి. మొదట్లో హీరో కేరక్టర్ కి స్టైల్.. విలన్ పొగరు చూపించేందుకు ఉపయోగపడ్డ సిగరెట్.. ఆ తర్వాత మహిళల నోట్లోకి కూడా వచ్చేసింది.

అయితే మొదట్లో మాత్రం వ్యాంప్ క్యారెక్టర్స్ చేసే మహిళల చేత సిగరెట్ సీన్స్ చేయించేవారు మూవీ మేకర్స్. కానీ ఆ తర్వాత ట్రెండ్ మారిపోయింది. కల్చర్ అంటూ కొత్త కలర్స్ రంగంలోకి వచ్చేశాయి. ఇందులో భాగంగా ఇప్పుడైతే.. ఫెమినిజం ఛాయలను ప్రస్ఫుటించేందుకు గాను సిగరెట్ ను ఉపయోగించేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా వచ్చిన బెరైలీ కి బర్ఫీ.. లిప్ స్టిక్ అండర్ మై బుర్ఖా.. అంతకు ముందు వచ్చిన ఎన్ హెచ్ 10.. పింక్ సినిమాల్లో కూడా అమ్మాయిలతో సిగరెట్ కాల్పించడం కనిపిస్తుంది.

"తను ఎంతో స్వేచ్ఛగా జీవించే వ్యక్తి అని ఓ మహిళను చూపించేందుకు సిగరెట్ కాల్చడం కంటే సులువైన మార్గం వేరేదీ లేదు" అంటున్నాడు ఎన్ హెచ్ 10 దర్శకుడు నవదీప్ సింగ్. ప్రముఖ నవలా రచయిత్రి సుకన్యా వెంకట్రాఘవన్ కూడా ఇలాంటి అభిప్రాయమే చెబుతున్నారు. "గతంలో సాధారణ మహిళలను వ్యాంప్ పాత్రలను వేరుగా చూపించేందుకు సిగరెట్ ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు మోడర్న్ అని చెప్పేందుకు ఇలా చూపిస్తున్నారు" అన్నారు సుకన్య. ట్రెండ్ ఎలా మారుతున్నా.. మొత్తం మీద మహిళలతో సిగరెట్లు కాల్పించే సీన్స్ మాత్రం ఇప్పుడు తెగ పెరుగుతున్నాయి