Begin typing your search above and press return to search.

పండ‌గ త‌ర్వాత థియేట‌ర్ల‌ కు రార‌ని త‌గ్గారా?

By:  Tupaki Desk   |   29 Jan 2020 8:58 AM GMT
పండ‌గ త‌ర్వాత థియేట‌ర్ల‌ కు రార‌ని త‌గ్గారా?
X
సంక్రాంతి సంద‌డి అయి పోయింది. జ‌న‌వ‌రి ముగుస్తోంది. పెద్ద పండ‌క్కి నాలుగు సినిమాలు రిలీజైతే వాటిలో అల వైకుంఠ‌పుర‌ములో హ‌వా సాగింది. ఇత‌ర సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా సెల‌వుల్ని క్యాష్ చేసుకోగ‌లిగాయి. స‌రిలేరు క‌లెక్ష‌న్స్ బావున్నాయి. ద‌ర్బార్ ఫ‌ర్వాలేద‌నిపించింది. ఇక క‌ళ్యాణ్ రామ్ `ఎంత మంచివాడ‌వురా` ప్ర‌య‌త్నం ఎందుక‌నో మిస్ ఫైరైందన్న టాక్ వినిపించింది. కొత్త సంవ‌త్స‌రంలో సంక్రాంతి శుభారంభ‌మే అనుకుంటే.. పండ‌గ త‌ర్వాత సంగ‌తేమిటి?

పండ‌గ‌ల్లో ఇంటిల్లిపాదీ థియేట‌ర్ల‌ కు వ‌చ్చి సినిమాలు చూశారు. అందుకే కాస్త కాసులు గ‌ల‌గ‌ల‌లాడాయి. బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి క‌నిపించింది. కానీ పండ‌గ పోయాక సంగ‌తే వేరు. సినిమా ఎక్స్ ట్రార్డిన‌రీ గా ఉంటే త‌ప్ప ఇక‌పై జ‌నం థియేట‌ర్ల‌ కు వ‌చ్చే ప‌రిస్థితి లేదు. టిక్కెట్టు కోసం డ‌బ్బులు ఇచ్చేందుకు ఎవ‌రూ ఆస‌క్తి గా లేరు. ఈ విష‌యం పండ‌గ త‌ర్వాత రిలీజైన డిస్కోరాజా వ్య‌వ‌హారం క్లియ‌ర్ క‌ట్ గా చెబుతోంది. మాస్ మ‌హారాజా రవితేజ సినిమానే పండ‌గ త‌ర్వాత‌ ఆడ‌లేదేమిటో. ఆరంభం ఫ‌ర్వాలేదులే అంటూ మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మైనా.. సెల‌వులు లేక‌ పోవ‌డంతో జ‌నం థియేట‌ర్ల‌ కు క‌దిలి రాలేదు. దాని ప్ర‌భావం వ‌సూళ్ల‌ పైనా క‌నిపించింది.

అయినా పండ‌గ ఊపు వేరు.. పండ‌గ త‌ర్వాత సీను వేరు. ఇది ప్ర‌తిసారీ చూసేదే. అందుకేనేమో.. డిస్కో రాజా రిజ‌ల్ట్ చూశాక‌.. మునుముందు రిలీజ్ కి వ‌స్తున్న అశ్వ‌థ్థామ - చూసి చూడంగానే నిర్మాత‌లు ముందే అలెర్ట్ అయిపోయారు. ఈ సినిమాల్ని ప‌రిమితంగానే రిలీజ్ చేయాల‌ని భావించిన‌ట్టు క‌నిపిస్తోంది. రిజ‌ల్ట్ బావుంటే థియేట‌ర్లు పెంచుకోవ‌చ్చులే అనే ధోర‌ణి తో మేక‌ర్స్ ఉన్నార‌ట‌. సినిమా బావుంది అన్న టాక్ వ‌స్తేనే ముందుకు న‌డిపించుకోవాల‌నే ఆలోచ‌న ఉంద‌న్న టాక్ ట్రేడ్ లో వినిపిస్తోంది.