Begin typing your search above and press return to search.
శ్రీదేవి తర్వాత.. ఆ స్థాయి నాదేః కంగనా రనౌత్
By: Tupaki Desk | 25 Feb 2021 10:00 PM ISTఅతిలోక సుందరి శ్రీదేవి తర్వాత.. యాక్టింగ్ లో తానే గొప్పదాన్ని అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. సినిమాల్లో కామెడీ సీన్లలో శ్రీదేవి తర్వాత ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ చూపించే సత్తా తనకే ఉందని ప్రకటించుకుంది కంగనా.
కంగనా నటించిన 'తను వెడ్స్ మను' సినిమా విడుదలై నేటికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసిందీ బ్యూటీ. ఈ సినిమా.. తనకు నటనలో కొత్త పాఠాలను నేర్పిందని పేర్కొంది. 2011లో విడుదలైన తొలి పార్టుకు.. 2015లో సీక్వెల్ కూడా వచ్చింది. ఈ సినిమాలో కంగనా ద్విపాత్రాభినయం చేసింది.
ఈ మూవీ రిలీజై పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందించింది కంగనా. ''తను వెడ్స్ మను సినిమాకు ముందు ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించాను. కానీ ఈ చిత్రం నా కెరీర్‌ను మరో విధంగా మార్చింది. ఇందులో కామెడీతో మెయిన్ లీడ్ చేశాను. నా కామెడీ టైమింగ్ కూడా చక్కగా కుదిరింది. దీంతో లెజండరీ నటి శ్రీదేవి తర్వాత ఆ లెవల్లో కామెడీ చేసిన నటిని నేనే'' అని ప్రకటించుకుంది కంగనా.