Begin typing your search above and press return to search.
చిరు.. బాలకృష్ణ ఇప్పుడు నాగార్జున
By: Tupaki Desk | 11 Oct 2020 4:19 PM ISTడాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఆలస్యం అవుతుంది. ఇప్పటికే పూర్తి అయ్యి విడుదలకు రెడీ అవ్వాల్సిన సినిమా షూటింగ్ పూర్తి చేసుకోలేక పోయింది. త్వరలో ఫైటర్ మూవీని పునః ప్రారంభించేందుకు రెడీ అవుతున్న దర్శకుడు పూరి జగన్నాద్ తదుపరి సినిమాల విషయంలో గత కొన్ని రోజులుగా ప్రముఖంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లుగా కనిపిస్తున్న దర్శకుడు పూరి ప్రస్తుతం చేస్తున్న ఫైటర్ ను కూడా సక్సెస్ చేసుకుంటే వరుసగా స్టార్ హీరోలు ఈయనతో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
చాలా కాలంగా చిరంజీవితో ఒక సినిమాను చేయాలని పూరి కోరుకుంటున్నాడు. అందుకోసం కథ కూడా వినిపించాడు. కొన్ని కారణాల వల్ల వీరి కాంబో మూవీ సెట్ అవ్వలేదు. మరో సారి చిరంజీవితో సినిమాకు పూరి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇక బాలకృష్ణ తో పైసా వసూళ్ తీసిన పూరి మరో సినిమాను ఆయనతో తీసేందుకు డేట్లు కూడా తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. చిరంజీవి మరియు బాలకృష్ణల్లో మొదట ఈయన ఎవరితో సినిమా చేస్తాడా అంటూ ఆసక్తిగా చూస్తున్న సమయంలో అనూహ్యంగా నాగార్జునతో పూరి మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి.
ఒక ఫాంటసీ కథను నాగార్జున కోసం పూరి రెడీ చేశాడని ప్రస్తుతం ఇద్దరికి ఉన్న కమిట్ మెంట్స్ పూర్తి అయిన తర్వాత వీరి కాంబో మూవీని పట్టాలెక్కించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. ఫాంటసీ కథతో నాగార్జున వయసు మరియు బాడీలాంగ్వేజ్ కు తగ్గట్లుగా ఈ సినిమాను పూరి తెరకెక్కించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. చాలా నెలలుగా చిరంజీవి.. బాలకృష్ణల పేర్లు వినిపించాయి. ఇప్పుడు నాగార్జున పేరు కూడా యాడ్ అయ్యింది. ఈ ముగ్గురిలో పూరి సినిమా నిజంగా ఎవరితో తీయబోతున్నాడు అనేది చూడాలి.