Begin typing your search above and press return to search.
25యేళ్ల తర్వాత అఖిల్ కి తల్లిగా మరోసారి.. ప్లస్ కానుందా..?
By: Tupaki Desk | 12 Jun 2020 2:40 PM ISTటాలీవుడ్ లో మొదటి సినిమా నుండి ఒక్క సరైన హిట్ అందుకోలేకపోయాడు అక్కినేని అఖిల్. ఇప్పటికే మూడు సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా తనకు బ్లాక్ బస్టర్ రుచిని చూపించలేకపోయాయి. కానీ అఖిల్ కి అభిమానుల ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. తండ్రి అక్కినేని నాగార్జున, అన్న నాగచైతన్య అభిమానులు ఒక మంచి సినిమాతో వస్తే ఆదరించడానికి సిద్దంగానే ఉన్నారు. కానీ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం అఖిల్ కెరీర్ గురించి ఆలోచనలో పడ్డారు. అఖిల్.. హలో.. మిస్టర్ మజ్ను సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ కథను ఓకే చేసాడు అఖిల్. కానీ బొమ్మరిల్లు భాస్కర్ కూడా వరుస ప్లాపులలో ఉండటంతో అభిమానులలో అక్కినేని అభిమానులలో ఆందోళన మొదలైంది.
ఈ సినిమాకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన సినిమా.. కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఈ లవ్ అండ్ ఫ్యామిలీ సినిమాలో అఖిల్ తల్లిగా సీనియర్ నటి ఆమని నటిస్తుంది. సరిగ్గా 25యేళ్ళ క్రితం.. అంటే 1995లో అఖిల్ బుడిబుడి అడుగులు వేస్తూ నటించిన 'సిసింద్రీ' సినిమాలో కూడా ఆమని తల్లిగా నటించింది. ఈ నేపథ్యంలో 25యేళ్ళ తర్వాత అఖిల్ తల్లిగా ఆమని నటిస్తుండడంతో సినిమా పై పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడ్డాయనే చెప్పాలి. మరో విషయం ఏమంటే.. అఖిల్ - ఆమని మధ్య నడిచే సన్నివేశాలకు 'సిసింద్రీ' సీన్లు రిఫరెన్స్ గా తీసుకున్నారని టాక్. అయితే ఆమని మళ్లీ అఖిల్ సినిమా హిట్ అవ్వడంలో పాత్ర వహిస్తుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డే.. నటిస్తుండగా గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.