Begin typing your search above and press return to search.

13 ఏళ్ల త‌ర్వాత 'వైశాలి' కాంబో మ‌రో థ్రిల్ల‌ర్ తో!

By:  Tupaki Desk   |   14 Dec 2022 7:30 AM GMT
13  ఏళ్ల త‌ర్వాత వైశాలి కాంబో మ‌రో థ్రిల్ల‌ర్ తో!
X
ఆది పినిశెట్టి-అరివ‌ళ‌గ‌న్-శంక‌ర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన హార‌ర్ థ్రిల్ల‌ర్ 'ఈర‌మ్' కోలీవుడ్ లో ఎంత పెద్ద విజ‌యం సాధించిందో చెప్పాల్సిన ప‌నిలేదు. అదే సినిమా తెలుగులో 'వైశాలి' టైటిల్ తో అనువాద‌మై ఇక్క‌డా మంచి విజ‌యాన్ని అందుకుంది. సినిమా ఆద్యంతం ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది. రెగ్యుల‌ర్ థ్రిల్ల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా రూపొందిన సినిమా ఇది. థ్రిల్ల‌ర్ జోన‌ర్ కి న‌వ్య పంథాని ప‌రిచ‌యం చేసింద‌నొచ్చు.

పిన్ టూ పిన్ ప్ర‌తీ స‌న్నివేశం ఎంతో ఆస‌క్తిక‌రంగా మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. అందుకే శంక‌ర్ లాంటి లెజెండ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌డా నికి ముందుకొచ్చారు. ఈ చిత్రంతో ఆదికి న‌టుడిగా మంచి పేరొచ్చింది. నందా దొరై రాజ్.. శింధు మీన‌న్ పాత్ర‌లు అంత‌కు మంచి హైలైట్ అయ్యాయి. సినిమాకి ఈ రెండు పాత్ర‌లు పిల్ల‌ర్ లా నిలిచాయి. అంత‌టి స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ మ‌ళ్లీ చేతులు క‌ల‌ప‌లేదు.

ఈనేప‌థ్యంలో తాజాగా అదే ద‌ర్శ‌కుడు ఆదితో మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించారు. 'స‌బ‌దం' అనే టైటిల్తో మ‌రో హార‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆది పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ సినిమాకి సంబంధించిన గ్రిప్పింగ్ పోస్టర్ ఒక‌టి రిలీజ్ చేసారు. రద్దీగా ఉండే గబ్బిలాలు ఓ భారీ చెవిలోకి ప్రవేశించడం. వింతైనా గబ్బిలాల శబ్దం..ప్ర‌తిధ్వ‌నులు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇది డిఫ‌రెంట్ కాన్సెప్ట్ హార‌ర్ థ్రిల్ల‌ర్ గా హైలైట్ అవుతుంది. పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతుంది. సినిమాకి సంబంధించి ప‌నులు మొదలైన‌ట్లు తెలుస్తోంది. కాన్సెప్ట్ పోస్ట‌ర్ తోనే సినిమాకి బ‌జ్ మొద‌లైంది.

మ‌రి 'వైశాలి' కాంబో తెర‌పై ఎలా క‌నిపిస్తుందో చూడాలి. 7G ఫిల్మ్స్ - ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

వైశాలి కి సంగీతం అందించిన ఎస్.ఎస్ థమన్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందిస్తుండ‌టం విశేషం. మ్యూజిక్ డైరెక్ట‌ర్ గా థ‌మ‌న్ హ‌వా న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో సినిమాపై అంచ‌నాలు అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. తెలుగు-తమిళంలో ఏకకాలంలో ఈ చిత్రం ప్రారంభం కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.