Begin typing your search above and press return to search.

తాచులు పొర‌విప్పి పెన‌వేసుకున్నాయా!

By:  Tupaki Desk   |   5 Feb 2020 11:02 AM IST
తాచులు పొర‌విప్పి పెన‌వేసుకున్నాయా!
X
తాచులు పొర‌విప్పి సంగ‌మించే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఇదిగో ఈ దృశ్యం చూశాక ఆ సంగ‌తి మీకే అర్థ‌మవుతోంది. రాయ్ ల‌క్ష్మీ ఇటీవ‌లే నాగినిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డికి ఓటీటీ వేదిక‌ పై రొమాంటిక్ ల‌వ్ స్టోరీల్లో అవ‌కాశాల వెల్లువ మొద‌లైంది. సెక్సిణిగా రాయ్ ల‌క్ష్మీ ఇమేజ్ ని క్యాష్ చేసుకునే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంది.

ప్ర‌ఖ్యాత జీ 5 ఓటీటీ వేదిక‌ పై ఈ అమ్మ‌డికి `పాయిజన్ 2` అనే వెబ్ సిరీస్ లో అవ‌కాశం ద‌క్కింది. ఇప్ప‌టికే ఒక భాగం విజ‌య‌వంత‌మైంది. ఈ రెండో సీజ‌న్ లో రాయ్ లక్ష్మి తన డిజిటల్ అరంగేట్రానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ సిరీస్ లో బాలీవుడ్ నటుడు అఫ్తాబ్ శివదాసాని సరసన నటించనుంది. తాజాగా పాయిజన్ 2 ఫస్ట్ లుక్ పోస్టర్ విడుద‌లైంది. ఈ పోస్ట‌ర్ లో ఆఫ్తాబ్ తో రాయ్ ల‌క్ష్మీ రొమాన్స్ హీటెక్కిస్తోంది. ఒంటి పై నూలు పోగైనా లేకుండా ఘాడ‌మైన భంగిమలో కౌగిలించుకోవడం అగ్గి రాజేస్తోంది. రెండు తాచులు పెన‌ వేసుకున్నాయా? అన్నంత‌గా ఆ భంగిమ వేడెక్కిస్తోంది.

ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసిన రాయ్ ల‌క్ష్మీ .. వెబ్ ప్రపంచంలోకి నా మొదటి ప్ర‌య‌త్న‌మిదేన‌ని తెలిపింది. ఏప్రిల్ లో హై వోల్టేజ్ డ్రామా వేడిని మ‌రింత‌గా పెంచుతుంది. ప్రేమ - ప్రతీకారం నేప‌థ్యం లో ఉత్కంఠ రేపే కథతో # పాయిజన్ 2 తెర‌కెక్క‌నుంది.. అంటూ వివ‌రాల్ని అందించింది. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌ లో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 30 నుండి జీ5 లో ప్రసారం కానుంది.