Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: ఐష్‌ మామూలుగా రెచ్చపోలే!!

By:  Tupaki Desk   |   23 Sep 2016 4:42 PM GMT
ట్రైలర్ టాక్: ఐష్‌ మామూలుగా రెచ్చపోలే!!
X
బాలీవుడ్ ని ఓ తరం పాటు ఉర్రూతలూగించిన హీరోయిన్ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్. అభిషేక్ తో పెళ్లి తర్వాత బాగా గ్యాప్ తీసుకుని.. మళ్లీ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది కానీ.. అవి ఐష్ ని అభిమానులు చూడాలని అనుకునే యాంగిల్ కాదు. ఎప్పటికీ ఎవర్ గ్రీన్ బ్యూటీలో మెరిసిపోయే ఐశ్వర్యారాయ్ ని.. రొమాంటిక్ యాంగిల్ లో చూసేందుకు ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తుంటే.. వారందరి కోరికలను.. ఐష్ తీర్చేస్తోందని రీసెంట్ గా రిలీజ్ అయిన 'ఏ దిల్ హై ముష్కిల్' ట్రైలర్ చూస్తే అర్ధమైపోతోంది.

తనకంటే 9 ఏళ్లు చిన్నవాడైన రణబీర్ కపూర్ తో ఐష్ జోడీ కట్టడమే ఈ మూవీకి అసలు సిసలైన హైలైట్. ఇక ఆ కుర్రాడితో కలిసి ఐష్ చేసే రొమాన్స్ ను.. దర్శకుడు కరణ్ జోహార్ బాగానే ప్రొజెక్ట్ చేశాడు. ట్రైలర్ స్టార్టింగ్ లో అనుష్క శర్మను మాత్రమే చూపించడంతో.. ఆమె డామినేషన్ ఉంటుందనే ఫీలింగ్ వచ్చినా.. కాసేపటికే అవన్నీ పటాపంచలైపోతాయి. అనుష్క శర్మనే కాదు.. కొన్ని చోట్ల రణబీర్ కపూర్ ని కూడా డామినేట్ చేసేసింది ఈ నీలికళ్ల సుందరి.

40+ అయినా సరే తన ఏజ్ ని ఇంకా బిలో థర్టీ అనిపించేలా బాడీని మెయింటెయిన్ చెయ్యడంలో.. ఐశ్వర్యను ఎంత పొగిడినా తక్కువే అనుకుంటున్నారు సినీ జనాలు. రణబీర్-ఐష్ లు రొమాన్స్ అదరగొట్టేశారని ట్రైలర్ తో ఫిక్స్ అయిపోవచ్చు. మరి రిజల్ట్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం.. మళ్లీ ఐష్ శకం స్టార్ట్ అయిపోయినట్లే.