Begin typing your search above and press return to search.

ఎల్లుండ రిలీజయ్యే సాంగుతో ప్రకంపనాలే

By:  Tupaki Desk   |   14 Sep 2016 3:30 PM GMT
ఎల్లుండ రిలీజయ్యే సాంగుతో ప్రకంపనాలే
X
ఈ శుక్రవారం బాలీవుడ్ డైరక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కరణ్‌ జోహార్ ఒక పాటను రిలీజ్ చేస్తున్నాడు. అయితే ఈ పాట రిలీజైన తరువాత అక్కడ మనం కొన్ని ప్రకంపనాలు చూసే ఛాన్సుంది. ఇప్పటికే ఇతగాడి తదుపరి సినిమా ''ఏ దిల్ హై ముష్కిల్'' పై చాలా హైప్ ఉంది. ఈ సాంగుతో అది ఎటు వెళ్తుందో అనేది ఒక విషయమైతే అసలు సాంగు ఐశ్వర్య రాయ్ క్రేజ్ ను ఏం చేస్తుందో అనేదే మరో విషయం.

నిజానికి ఈ సినిమాలో 30+ హీరో రణబీర్ కపూర్.. 40+ భామ ఐశ్వర్యను రొమాన్స్ చేస్తున్నాడంటేనే విడ్డూరం అనుకుంటే.. మొన్న రిలీజైన టీజర్లో ఆమెను శృంగారభరితంగా కౌగిళుంచుకోవడం.. రొమాంటిక్ ముద్దులు.. వామ్మో రచ్చలేపేశాయి. ఈ శుక్రవారం ఈ ఇద్దరి లవ్ ట్రాక్ కు సంబంధించిన బుల్లేయా అనే పాట ఒకటి విడుదలవుతోంది. ఈ వీడియోలో అసలు రణబీర్ అండ్ ఐష్‌ ఎలా రెచ్చిపోయారో చూస్తే ఖచ్చితంగా మెగాస్టార్ బచ్చన్ కు కోపమొచ్చే ఛాన్సుందని ఆల్రెడీ బాలీవుడ్డులో రూమర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సాంగులో ఆ రేంజులో మనోళ్ళు రొమాన్స్ పండించేశారంటారా?

దసరా సీజన్ పూర్తయ్యాక అక్టోబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లతో రణబీర్ చేసిన రొమాన్స్ సంగతేమో కాని.. చాలా రోజుల నుండి అందని హిట్టు ఇప్పుడైనా ఈ కుర్రాడికి కరణ్‌ ద్వారా దక్కుతుందా? లెటజ్ సీ.