Begin typing your search above and press return to search.

టీజర్ టాక్‌: ఊరిస్తున్న ఏ దిల్‌ హై ముష్కిల్

By:  Tupaki Desk   |   30 Aug 2016 12:07 PM IST
టీజర్ టాక్‌: ఊరిస్తున్న ఏ దిల్‌ హై ముష్కిల్
X
మామూలు సినిమాల్లో ఒక పెళ్లయిన లేడీ.. ఎవరన్నా కుర్రాడితో ఎఫైర్ పెట్టుకుంటే.. దానిని చాలా ఘోరంగా చూపిస్తారు. కాని దర్శకుడు కరణ్‌ జోహార్ మాత్రం అలాంటి అక్రమ సంబంధాలను కూడా చాలా అందంగా చూపిస్తాడు. అదే అతగాడి స్పెషాలిటీ. ఇప్పుడు మరోసారి అలాంటి ఫీటే చేస్తున్నట్లున్నాడు.

దీపావళికి రిలీజవ్వబోతున్న ''ఏ దిల్ హై ముష్కిల్'' సినిమా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే ముక్కూ ముక్కూ రాసుకుంటున్న రణబీర్ కూపర్ అండ్ ఐశ్వర్య రాయ్ పోస్టర్ సెగలు పుట్టిస్తుంటే ఇప్పుడు ఈ సినిమా టీజర్ అంతకంటే షాకింగ్ గా ఉంది. రణబీర్ అండ్ అనుష్క శర్మ రొమాంటిక్ ట్రాక్ ఒకెత్తయితే.. ఇందులో ఐశర్యరాయ్ తో మనోడు రొమాన్స్ చేసే ట్రాక్ మరో ఎత్తు. మరి ఐష్‌ ఒక పెళ్లయిన మహిళగా నటిస్తోందా.. లేదంటే డైవోర్సీనా.. అసలు కథ ఏంటనేది తెలియదు కాని.. గతంలో కరణ్‌ తీసిన కబీ అల్విదా నా కెహనా సినిమా టైపులో ప్లాట్ చాలా ఇంట్రస్టింగ్ నే ఉంది. ఆ బ్యాగ్రౌండ్ స్కోర్.. విజువల్స్.. మొత్తంగా తన దర్శకత్వ ప్రతిభ చూపిస్తూ కరణ్‌ జోహార్ అదరగొట్టాడు.

ముఖ్యంగా ఏ దిల్ హై ముష్కిల్ అంటూ సాగే టైటిల్ ట్రాక్ మ్యూజిక్ అదిరిపోయింది. ఎన్నాళ్ళనుండో హిట్టు కోసం ఎదురు చూస్తున్న రణబీర్ కపూర్ ఈసారైనా కొడతాడా మరి? ఏమో చూడాల్సిందే.