Begin typing your search above and press return to search.

ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ కి టాలీవుడ్‌ ప్రొఫెస‌ర్స్ స‌ల‌హాలు?

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:23 AM GMT
ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ కి టాలీవుడ్‌ ప్రొఫెస‌ర్స్ స‌ల‌హాలు?
X
ఆహాలో సెల‌బ్రిటీ టాక్ షో ప్ర‌తి శుక్ర‌వారం ఒక కొత్త ఎపిసోడ్ తో రంజుగా సాగుతోంది. మొదటి సీజన్ తో పోలిస్తే NBK సీజన్ 2 మ‌రింత రస‌ర‌మ్యంగా సాగుతోంది. తొలి ఎపిసోడ్ లో రాజ‌కీయ నాయ‌కులు నారా చంద్ర బాబు నాయుడు - నారా లోకేష్ ని బ‌రిలో దించి ఘ‌నంగా ప్రారంభించారు. తరువాత NBK తదుపరి రెండు ఎపిసోడ్ లలో యువ హీరోలతో చాటింగ్ పూర్త‌యింది. ఈసారి ఏకంగా ప‌రిశ్ర‌మ‌లో సుదీర్ఘ అనుభ‌వాల‌తో ఇండ‌స్ట్రీ డీన్ లు గా మారిన వారంద‌రినీ బ‌రిలో దించుతోంది ఆహా. తదుపరి ఎపిసోడ్ ల‌లో ద‌ర్శ‌కేంద్రుడు కె రాఘవేందర్ రావు .. అగ్ర నిర్మాతలు సురేష్ బాబు- అల్లు అరవింద్ లతో ఎన్.బి.కే సంభాషించనున్నారు.

ఈ ఎపిసోడ్ లు నిజానికి ఎంతో విజ్ఞాన‌దాయ‌కంగా సాగుతాయ‌న‌డంలో సందేహం లేదు. అలాగే ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ కి అవ‌స‌ర‌మ‌య్యే బోలెడంత కంటెంట్ ఇందులో పుల్ చేస్తారని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలోకి కొత్త ట్యాలెంట్ వ‌రద‌లా ప్ర‌వేశిస్తోంది. ఇందులో ఐఐఎంలు బిజినెస్ మేనేజ్ మెంట్ స్ట‌డీస్ చేసిన ఔత్సాహిక యువ‌త‌రంతో పాటు ఫిలింఇనిస్టిట్యూట్ ల‌లో చేరి చ‌దువుకుంటున్న ఉన్న‌త విద్యావంతులు ఉన్నారు. ఇలాంటి వారికి ఇండ‌స్ట్రీ డీన్ డి.సురేష్ బాబు.. ప్ర‌ముఖ అగ్ర నిర్మాత `ఆహా` అధినేత అల్లు అర‌వింద్... లెజెండ‌రీ ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ఏం సూచిస్తార‌న్న‌ది కూడా వేచి చూడాలి.

డి. సురేష్ బాబు- అల్లు అర‌వింద్ ఎపిసోడ్ నుంచి ప‌రిశ్ర‌మ చాలా ఆశిస్తోంది. ముఖ్యంగా నేటిత‌రం ఫిలింమేక‌ర్స్ కి అవ‌స‌ర‌మైన విలువైన స‌మాచారం వీరి నుంచి ఈ ఎపిసోడ్ లు క్యాప్చుర్ చేయాల్సి ఉంటుంది. బాలకృష్ణ తో రంజైన సంభాష‌ణ‌లు హాస్యంతో పాటు విలువైన ఫిలిం మేకింగ్ వివ‌రాల్ని అలాగే హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌లో అడ్వాన్స్ డ్ టెక్నాల‌జీ ఆవశ్య‌క‌త గురించి ఏం మాట్లాడ‌తారో చూడాల‌ని యువ ఫిలింమేక‌ర్స్ ఆశిస్తున్నారు. ముఖ్యంగా ద‌ర్శ‌కేంద్రుని సుదీర్ఘ అనుభ‌వాల నుంచి స్క్రీన్ ప్లే టెక్నిక్స్ క‌మ‌ర్షియ‌ల్ అంశాల క‌ల‌యిక‌పై బోలెడ‌న్ని టిప్స్ ని అందిస్తే అది ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు.

ఈసారి ఆహాలో ఆసక్తికరమైన కలయిక క‌నిపిస్తోంది. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది కాబ‌ట్టి పై సూచ‌న‌ల‌ను ఆహా బృందాలు దృష్టిలో ఉంచుకుంటాయ‌నే ఆశిద్దాం. డి.సురేష్ బాబు వంటి ప్ర‌ముఖ నిర్మాతకు సినీ వ్యాపారంలోనే కాదు థియేటర్ల నిర్వ‌హ‌ణ‌ రంగం.. స్టూడియోల నిర్వాహ‌ణ‌.. సినిమాల పంపిణీ .. ప్రొడ‌క్ష‌న్ స‌హా ఎన్నో వ్య‌వ‌హారాల్లో సుదీర్ఘ అనుభ‌వం ఉంది.

అత‌డు మాట్లాడితే యూనివ‌ర్శిటీ ప్రొఫెసర్ సంభాషించిన‌ట్టే ఉంటుంది. అందువ‌ల్ల ఆయ‌న నుంచి ఆహా ఎపిసోడ్ లో చాలా ఆశించ‌వ‌చ్చు. ఇక సురేష్ బాబుతో పాటు అల్లు అర‌వింద్ లాంటి దిగ్గ‌జం చాలా ఇన్ పుట్స్ ని ఔత్సాహిక మేక‌ర్స్ కి నేటిత‌రానికి అందిస్తార‌నే ఆశిద్దాం.

ఇక అన్ స్టాప‌బుల్ విత్ ఎన్.బి.కే చివరి ఎపిసోడ్ లో రాజకీయ నాయకులు సురేష్ రెడ్డి- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- సీనియర్ నటి రాధిక ఉన్నారు. ఆహా ఒరిజిన‌ల్ కంటెంట్ ప్ర‌జ‌ల్లో విశేష ఆద‌ర‌ణ పొందుతోంది. ఇలాంటి స‌మ‌యంలో ఇండ‌స్ట్రీ ప్రొఫెస‌ర్స్ అంతా ఈ వేదిక‌పైకి వ‌చ్చి క్లాసులు చెప్ప‌డం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామ‌మే. స‌ర‌దా సంభాష‌ణ‌ల‌తో పాటు అతిథుల కాలిబ‌ర్ ని బ‌ట్టి హోస్ట్ ప్ర‌శ్న‌లు సంధిస్తే బావుంటుంద‌ని అంతా ఆశిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.