Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌ అత్యుత్సాహం మరో అడుగు ముందుకు

By:  Tupaki Desk   |   22 Jun 2020 11:00 AM IST
ఫ్యాన్స్‌ అత్యుత్సాహం మరో అడుగు ముందుకు
X
స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ వ్యవహరిస్తున్న తీరు కొన్ని సార్లు అతిశయోక్తిగా అనిపిస్తుంది. మొన్నటి వరకు తమిళ స్టార్‌ హీరోల ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వారు. సోషల్‌ మీడియా వేదికగా పెద్ద యుద్దమే జరిగేది. ఇప్పుడు అదే తరహా సోషల్‌ వార్‌ తెలుగు ఫ్యాన్స్‌ మద్య కూడా జరుగుతోంది. సోషల్‌ మీడియాలో జరుగుతున్న స్టార్‌ హీరోల రికార్డుల వార్‌ కు అడ్డు అదుపు లేకుండా పోయింది. మొన్నటి వరకు స్టార్‌ హీరోల ఫస్ట్‌ లుక్‌ లైక్స్‌ షేర్స్‌ హ్యాష్‌ ట్యాగ్స్‌ బర్త్‌ డే శుభాకాంక్షల గురించి చర్చించుకునేవారు.

తాజాగా హీరోల ఫ్యాన్స్‌ అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే హ్యాష్‌ ట్యాగ్స్‌ తో ట్రెండ్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అది కూడా రికార్డు స్థాయి ట్రెండ్స్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆగస్టులో మహేష్‌ బాబు బర్త్‌ డే జరుపుకోబోతున్నాడు. ఆయన బర్త్‌ డేకు ఇంకా రెండు నెలల సమయం ఉంది. అప్పుడే ట్విట్టర్‌ లో మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ట్రెండ్‌ మొదలు పెట్టారు. నిన్న అడ్వాన్స్‌ హ్యాపీ బర్త్‌ డే మహేష్‌ బాబు హ్యాష్‌ ట్యాగ్‌ ను పోస్ట్‌ చేశారు. ఆ హ్యాష్‌ ట్యాగ్‌ ను రికార్డు స్థాయిలో పోస్ట్‌ చేశారు.

కేవలం 24 గంటల్లో ఆ హ్యాష్‌ ట్యాగ్‌ తో 8.4 మిలియన్స్‌ ట్వీట్స్‌ నమోదు అయ్యాయి. ఎన్టీఆర్‌ బర్త్‌ డే సందర్బంగా ఫ్యాన్స్‌ 24 గంటల్లో 8.5 మిలియన్‌ ల ట్వీట్స్‌ ను చేశారు. ఆ రికార్డును బ్రేక్‌ చేయాలనుకున్న మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కొద్ది తేడాతో ఆ రికార్డు ను మిస్‌ అయ్యారు. ఫ్యాన్స్‌ రెండు నెలల ముందే ఇలా హ్యాష్‌ ట్యాగ్‌ తో ట్విట్టర్‌ లో రికార్డు క్రియేట్‌ చేయాలనుకోవడం అత్యుత్సాహం మరో అడుగు ముందుకు వేసినట్లుగా అనిపిస్తుందని నెటిజన్స్‌ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ముందు ముందు మరెన్ని ఇలాంటి ఘోరాలు చూడాల్సి వస్తుందో అంటూ మరికొందరు మీమ్స్‌ పోస్ట్‌ చేస్తున్నారు.