Begin typing your search above and press return to search.

అక్కడ సర్కారు వారి అడ్వాన్స్ బుకింగ్స్ మరీ నీరసంగా ఉన్నాయే..!

By:  Tupaki Desk   |   11 May 2022 9:36 AM GMT
అక్కడ సర్కారు వారి అడ్వాన్స్ బుకింగ్స్ మరీ నీరసంగా ఉన్నాయే..!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట'' విడుదలకు సర్వం సిద్ధమైంది. పరశురాం పెట్లా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం.. రేపు గురువారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. 'భరత్ అనే నేను' 'మహర్షి' 'సరిలేరు నీకెవ్వరు' వంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత మహేష్ నుంచి వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

దీనికి తగ్గట్టుగానే SVP ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ - పాటలు విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. ఇది 125 - 130 కోట్ల మధ్య ఉండొచ్చని అంటున్నారు. భారీ టార్గెట్ తో బరిలో దిగిన సర్కారు వారి పాట అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా సాగుతున్నాయి. అయితే బయట రాష్ట్రాల్లో మహేశ్ సినిమా సందడి పెద్దగా కనిపించడం లేదు.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని కేవలం తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. మహేష్ బాబుకు ఇతర రాష్ట్రాల్లో ఉండే క్రేజ్ దృష్ట్యా తెలుగు వెర్షన్ ను ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. తమిళనాడు - కర్ణాటక లలో మహేశ్ సినిమాల హడావిడి నడుస్తుంది. కానీ ఈసారి మాత్రం అలా జరగడం లేదు.

బెంగళూరు, చెన్నై లాంటి నగరాల్లో SVP అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. రిలీజ్ కు ఇంకొన్ని గంటలే ఉన్నా.. బుక్ మై షోలో చాలా థియేటర్లలో గో గ్రీన్ కనిపిస్తోంది. కొన్ని షోలు ఫుల్ అయినప్పటికీ.. మెజారిటీ భాగం ఇంకా ఫుల్ అవ్వాల్సి ఉంది. దీనిని బట్టి రెస్టాఫ్ ఇండియాలో సర్కారు వారి ఒపెనింగ్స్ అంతంతమాత్రంగానే ఉంటాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఏదేమైనా సూపర్ స్టార్ సినిమా తెలుగు రాష్ట్రాల అవతల ఇంత నీరసంగా కనిపించడం ఆశ్చర్యకరమైన విషయమే. అయితే ఈ పరిస్థితికి ప్రధాన కారణం స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ ఉండటమే అని తెలుస్తోంది. కరోనా పాండమిక్ తర్వాత అకడమిక్ ఇయర్ లో మార్పులు వచ్చాయి. పలు చోట్ల ఇంకా పరీక్షలు పూర్తవ్వలేదు. ఇది సర్కారు వారి పాటకు దెబ్బ అనే అనుకోవాలి.

తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఓవర్ సీస్ లో 'సర్కారు వారి పాట' మేనియా కనిపిస్తోంది కాబట్టి.. అక్కడ వసూళ్ళు కలిసొచ్చే అవకాశం ఉంది. యూఎస్ లో ప్రీమియర్స్ ప్రీ సేల్స్ ద్వారా $650K వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇటీవల వచ్చిన భీమ్లానాయక్ ($610K) - రాధేశ్యామ్ ($600K) - పుష్ప ($510K) - ఆచార్య ($500k) సినిమాల కంటే ఎక్కువ.

మహేష్ కెరీర్ లో యూఏస్ఏ ప్రీమియర్ షోల నుంచి 500K డాలర్లకు పైగా అందుకున్న 8వ సినిమా 'సర్కారు వారి పాట'. ఈ జాబితాలో రజినీకాంత్ - ప్రభాస్ - ఎన్టీఆర్ లకు 4 సినిమాలు ఉంటే.. చిరంజీవి - పవన్ కళ్యాణ్ లకు చెరో 3 చిత్రాలు ఉన్నాయి. రామ్ చరణ్ - అల్లు అర్జున్ లకు తలోక సినిమా ఉంది.

కాగా, పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్ టైన్మెంట్స్ - 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. మహేశ్ బాబుకి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.