Begin typing your search above and press return to search.

బేబమ్మకు 'అద్వైత'కు సంబంధమేంటి గూగుల్..?

By:  Tupaki Desk   |   27 March 2021 12:30 AM GMT
బేబమ్మకు అద్వైతకు సంబంధమేంటి గూగుల్..?
X
'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.. ఫస్ట్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. అందంతో పాటుగా బేబమ్మ పాత్రలో అమ్మడు చూపించిన అభినయం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. కేవలం కృతి కోసమే రిపీటెడ్ గా సినిమా చూసిన ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. దీంతో గత కొన్ని నెలలుగా ఎక్కడ చూసినా బేబమ్మ పేరే వినిపిస్తోంది. ఈ క్రమంలో క్రేజీ ఆఫర్స్ కూడా అందుకుంటోంది. అయితే కృతి గురించి తెలుసుకోవడానికి గూగుల్ తల్లి హెల్ప్ తీసుకోవాలనుకున్న కుర్రకారు కన్ఫ్యూజన్ లో పడే పరిస్థితి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. గూగుల్ లో 'కృతి శెట్టి' పేరు టైప్ చేయగా.. వికీ పీడియాలో 'అద్వైత' (ఇండియన్ యాక్ట్రెస్) అని వస్తోంది. అక్కడ ఉప్పెన బ్యూటీతో పాటు మరో హీరోయిన్ ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో 'కృతి శెట్టి' అని సెర్చ్ చేస్తే అద్వైత అని రావడమేంటి? వేరే అమ్మాయి ఫోటోలు చూపించడం ఏంటని అందరూ కన్‌ఫ్యూజన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో కృతి శెట్టి అసలు పేరు అద్వైత అయ్యుండొచ్చు అనుకున్నారు. అయితే వికీ పీడియాలోకి వెళ్లి చూస్తే క‌ృతిశెట్టి పేరుతో మరో తమిళ్ హీరోయిన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తన పేరును సినిమాల కోసం 'అద్వైత'గా మార్చుకుంది. ఇలా కృతి శెట్టి పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉండటంతో గూగుల్ లో.. కృతి శెట్టి అలియాయ్ అద్వైత పేరుతో ఉప్పెన హీరోయిన్ ఫొటోలు కనబడుతున్నాయన్నమాట. కాకపోతే అద్వైత ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఈమె 'ఉప్పెన' హీరోయిన్ కృతి శెట్టి కాదు అని సూచిస్తోంది.

ఇదిలావుండగా కృతి శెట్టి ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సరసన 'శ్యామ్ సింగరాయ్‌' సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కలకత్తాలో జరుగుతోంది. అలానే సుధీర్ బాబు - డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబోలో వస్తున్న 'ఆ అమ్మాయి గురించి చెప్పాలి' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ లో నటిస్తోంది కృతి. ఇదే క్రమంలో 'ఉస్తాద్' రామ్ పోతినేని - డైరెక్టర్ లింగుసామి కాంబినేషన్లో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో కూడా కృతి శెట్టి అవకాశం దక్కించుకుంది.