Begin typing your search above and press return to search.

అడల్ట్ స్టార్ రిటైర్ అయ్యాక లైఫ్ ఎలా ఉంటుంది?

By:  Tupaki Desk   |   1 April 2016 4:00 AM IST
అడల్ట్ స్టార్ రిటైర్ అయ్యాక లైఫ్ ఎలా ఉంటుంది?
X
అడల్ట్ స్టార్ గా ఉంటూనే.. ఇండియాకు వచ్చేసి ఆపై బాలీవుడ్ లో అడుగు పెట్టిన సన్నిలియాన్ మాదిరే అందరికి స్టార్ డమ్ ఉండదు. పోర్న్ స్టార్ ముద్రను పోగొట్టుకోవటం.. సెలబ్రిటీ హోదాను సొంతం చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. అలాంటి ఇబ్బందిని అధిగమించింది సన్ని లియాన్. ఆమె సంగతి పక్కన పెడితే.. ఒక సగటు పోర్న్ స్టార్.. తన వృత్తి నుంచి రిటైర్ అయి సాదాసీదా జీవితాన్ని గడపాలంటే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? ఎలాంటి అనుభవాలు ఆమెను వెంటాడుతుంటాయి? అన్న ప్రశ్నలకు సమాధానంగా ఒకనాటి అడల్ట్ స్టార్ బ్రీ ఓల్సాన్ నోరు విప్పింది.

అడల్ట్ ఇండస్ట్రీ నుంచి దూరంగా వచ్చేసి.. తన మానాన తాను బతుకుతున్నప్పటికీ తాను ఎన్ని ఇబ్బందులు పడుతున్నానన్న విషయాన్ని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. దాదాపు ఐదేళ్ల కిందట అడల్ట్ సినిమాల నుంచి బయటకు వచ్చేసినప్పటికీ.. నేటికీ తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని చెప్పుకొచ్చింది.

మామూలు మనిషిగా బతకాలని తాను నిర్ణయించుకొని.. అడల్ట్ స్టార్ గా రిటైర్ అయినప్పటికీ తాను కోరుకున్నట్లుగా జరగటం లేదని ఆమె వాపోయింది. బయట తనను గుర్తు పట్టిన వారు ఎంతో రోతగా చూస్తారని.. దారుణమైన వ్యాఖ్యలు చేస్తుంటారని.. అలాంటి మాటలు వినకూడదని ఎంతగా అనుకున్నా కుదరటం లేదని బాధ పడింది. తాను తన వృత్తిని వదిలేసినా.. తనను ఆ కోణంలోనే చూస్తున్నారన్న ఆమె.. తాను ఎన్నో వ్యాపారాలు పెట్టినా కొద్ది రోజులకే అవి మూత పడ్డాయని పేర్కొంది.

తాను ఎక్కడికి వెళ్లినా తన గతం.. మనుషుల రూపంలో వెంటాడుతుందన్న ఆమె.. సమాజం తనను చాలా అసహ్యించుకుంటుందని చెప్పింది. లాస్ ఏంజెల్స్ నుంచి తానిప్పుడు ఇండియానాకు వెళ్లి అక్కడే ఉంటున్నట్లుగా పేర్కొంది. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నానని.. తన గతం లాంటి జీవితం తనకు వద్దని.. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను అంగీకరించనని చెప్పిన ఆమె.. తన గతం తనను నీడలా వెంటాడుతుందని చెప్పింది. అమెరికా లాంటి ప్రాశ్చాత్య దేశంలో ఓ మాజీ అడల్ట్ స్టార్ పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉండటం గమనార్హం.