Begin typing your search above and press return to search.

బోల్డ్ ఫిలిమ్స్ బోలెడు వస్తున్నాయ్

By:  Tupaki Desk   |   25 March 2016 5:30 PM GMT
బోల్డ్ ఫిలిమ్స్ బోలెడు వస్తున్నాయ్
X
ఇప్పుడు బాలీవుడ్ లో అన్ని రకాల సినిమాల కంటే అడల్ట్ కంటెంట్ మూవీస్ కే డిమాండ్ ఎక్కువగా ఉంది. బ్లూఫిలిమ్స్ కు దగ్గరగా ఉండే ఈ మూవీస్ కి ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తోంది. ఓపెనింగ్స్ విషయంలో సూపర్ స్టార్ల సినిమాలకు ఏ మాత్రం తీసిపోవడం లేదు. దీంతో అడల్ట్ కామెడీ అంటూ ఈ టైపు సినిమాలు వరుస పెట్టి క్యూ కట్టేస్తున్నారు.

ఎయిర్ లిఫ్ట్ - సాలా ఖడూస్ - నీర్జా లాంటి బయోపిక్స్ మాత్రమే కాకుండా. మస్తీ జాదే - క్యా కూల్ హై హమ్3లు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ముఖ్యంగా హేట్ స్టోరీ3 అయితే బడ్జెట్ ప్రకారం బ్లాక్ బస్టర్ సాధించిందని చెప్పాలి. ఇప్పుడు మరికొన్ని అడల్ట్ సినిమాలు కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ పై దాడికి సిద్ధమయ్యాయి. రిచా చడ్డా ప్రధానపాత్రలో కేబరెట్ అనే మూవీని పూజా భట్ నిర్మించింది. ఈ మూవీలో బోల్డ్ సీన్స్ బోలెడన్ని ఉన్నాయంటున్నారు.

పత్రలేఖ ప్రధాన పాత్రపాత్రలో నటించిన లవ్ గేమ్స్ పై ఇప్పటికే ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అయామ్ సెక్స్ అడిక్ట్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. వీటితో పాటు పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటించిన వన్ నైట్ స్టాండ్ ఏప్రిల్ 22న విడుదల కానుంది. ఎప్పటికప్పుడు విభిన్నమైన బోల్డ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న సన్నీ.. వన్ నైట్ స్టాండ్ తో మరో బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమంటున్నారు బాలీవుడ్ జనాలు.