Begin typing your search above and press return to search.

బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ తోనే కోట్లు కొల్ల‌గొడుతోంది!

By:  Tupaki Desk   |   13 Feb 2021 9:00 PM IST
బ్రాండ్ ప్ర‌మోష‌న్స్ తోనే కోట్లు కొల్ల‌గొడుతోంది!
X
అందానికి అందం.. అంత‌కుమించిన ప్ర‌తిభ‌తో తెరంగేట్రం చేసిన కొద్ది స‌మ‌యంలోనే అగ్ర క‌థానాయిక హోదాను అందుకుంది కియ‌రా అద్వాణీ. ఈ ముంబై బ్యూటీకి అటు ఉత్త‌రాది ఇటు ద‌క్షిణాది రెండుచోట్లా వీరాభిమానులున్నారు. ఇక ఈ అమ్మ‌డు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చేసాక‌.. టాలీవుడ్ ‌కు దూరంగానే ఉన్నా కాంటాక్ట్స్ మాత్రం విడిచిపెట్ట‌న‌ని ఇంత‌కుముందు ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

బాలీవుడ్ లో న‌ట‌వారస‌త్వంతో సంబంధం లేకుండా ఎదిగేసిన ఈ బ్యూటీకి ప్ర‌తిభ చూసే అవ‌కాశాలిచ్చార‌ని నెపోలిజం చూడ‌కుండానే అగ్ర హీరోలు ప్రోత్స‌హిస్తున్నార‌ని తెలిపింది.

ఇక కియ‌రా త‌న ట్యాలెంట్ తో ప‌లు కార్పొరెట్ బ్రాండ్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. ఇంత‌కుముందు సోనాక్షి.. సోన‌మ్ వంటి స్టార్లు ప్ర‌చారం చేసే మైంత్ర కు ఈ భామ‌నే ఇప్పుడు బ్రాండ్ ప్ర‌మోట‌ర్. మ‌రోవైపు నైకా వంటి ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌కు కియ‌రా ప్ర‌మోష‌న్ చేస్తోంది. ఒప్పో.. హౌసింగ్ డాట్ కాం.. పారాచూట్.. మెబాజ్.. ఇలా ప్ర‌ఖ్యాత బ్రాండ్ల‌న్నీ అమ్మ‌డి ఖాతాలోనే ప‌డ్డాయి. ఒక్కో అసైన్ మెంట్ కి ఒక్కో కాంట్రాక్టుకు కియ‌రా కోట్ల‌లో ఆర్జిస్తోందని స‌మాచారం. ఇప్ప‌టికిప్పుడు కియ‌రా ఖాతాలో ప‌లు క్రేజీ బ్రాండ్లు ఉన్నాయి. వీట‌న్నిటితోనే భారీగా ఆర్జిస్తోంది. మ‌రోవైపు ఒక్కో సినిమాకి కోట్ల‌లో పారితోషికం అందుకుంటూ నిర్మాత‌ల గుండెల్లో గుబులు పెంచేస్తోందిట‌. షేర్ షా- జ‌గ్ జ‌గ్ జియో- భూల్ భుల‌యా 2 చిత్రాల్లో కియ‌రా ప్ర‌స్తుతం న‌టిస్తోంది.