Begin typing your search above and press return to search.
క్వారంటైన్ లో బన్ని.. నాన్నకు దోసెలు వేస్తున్న అల్లు అర్హ
By: Tupaki Desk | 5 May 2021 10:00 PM ISTటైలిష్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ అల్లరి పిడుగు అన్న సంగతి తెలిసిందే. డాడీతో ఇంట్లో ఉన్నప్పుడు ఫన్నీ గేమ్స్ ఆడడం తనకు అలవాటు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ స్వీయ నిర్భంధం (హోమ్ ఐసోలేషన్)లో కోవిడ్ కి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
అయితే ఇలాంటి కష్ట కాలంలో కూడా తన తండ్రికి దోసెలు వేసి అందిస్తోంది అర్హ. అందుకు సంబంధించిన క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది. అర్హలో ఈ ట్యాలెంట్ నిజంగా మెచ్చదగినది.బన్ని పుష్ప చిత్రీకరణలో ఉండగా కోవిడ్ పాజిటివ్ వచ్చిందని అని ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం షూటింగ్ ని వాయిదా వేసింది సుక్కూ టీమ్. ప్రస్తుతం బన్ని చికిత్స తో కోలుకుంటున్నారు.
